Ramya : సమంత, రష్మిక.. ఇప్పుడు దీపిక.. ఆడవాళ్ళ మీదే మీ విమర్శలు.. సంచలన ట్వీట్ చేసిన కన్నడ నటి..

తాజాగా దీనిపై స్పందిస్తూ కన్నడ నటి రమ్య తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. నటి రమ్య తన ట్వీట్ లో.................

Ramya : సమంత, రష్మిక.. ఇప్పుడు దీపిక.. ఆడవాళ్ళ మీదే మీ విమర్శలు.. సంచలన ట్వీట్ చేసిన కన్నడ నటి..

Kannada actress ramya tweet on trolls about heroins goes viral

Updated On : December 19, 2022 / 10:40 AM IST

Ramya :  ఇటీవల పఠాన్ సినిమా నుంచి దీపిక, షారుఖ్ మధ్య ఓ రొమాంటిక్ పాటని రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ పాటలో రొమాన్స్ శృతి మించిందని, దీపిక మరీ ఓవర్ గా ఎక్స్ పోజింగ్ చేసిందని, తన బట్టలు మరీ వల్గర్ గా ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ పాటని వ్యతిరేకిస్తూ మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ పాటని, దీపిక పదుకొనేని దారుణంగా విమర్శిస్తున్నారు.

తాజాగా దీనిపై స్పందిస్తూ కన్నడ నటి రమ్య తాజాగా చేసిన ఓ ట్వీట్ వైరల్ గా మారింది. నటి రమ్య తన ట్వీట్ లో.. ”విడాకుల విషయంలో సమంతని, తన ఒపీనియన్ ని చెప్పినందుకు సాయి పల్లవిని, బ్రేకప్ చేసుకున్నందుకు రష్మికని, ఇప్పుడు సాంగ్ లో బట్టల విషయంలో దీపిక పదుకొనేని ట్రోల్ చేస్తున్నారు. ఎప్పుడూ ఇలా ఆడవాళ్ళ మీదే మీరు విమర్శలు చేస్తున్నారు. ఇది మా ఇష్టం. ఈ స్త్రీ ద్వేషం అనేది పోవాలి” అని పోస్ట్ చేసింది.

Kangana Ranaut : ఏకంగా లోక్‌సభ సెక్రటేరియట్ లోనే షూటింగ్‌కి అనుమతి కోరిన కంగనా.. అనుమతిస్తారా??

దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. కొంతమంది రమ్య చేసిన ట్వీట్ కి సపోర్ట్ చేస్తుంటే మరీ కొంతమంది ఈ విషయంలో రమ్యని కూడా ట్రోల్ చేస్తున్నారు.