Hanuman : ‘హనుమాన్’ సినిమా ఆదాయం నుంచి.. ఇప్పటివరకు అయోధ్యకు ఎన్ని కోట్లు డొనేట్ చేశారో తెలుసా?

హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి విరాళం ఇస్తాము అని ప్రకటించారు.

Hanuman : ‘హనుమాన్’ సినిమా ఆదాయం నుంచి.. ఇప్పటివరకు అయోధ్యకు ఎన్ని కోట్లు డొనేట్ చేశారో తెలుసా?

Hanuman Movie Donation to Ayodhya Ram Mandir five Rupees from each Ticket sold Full Details Here

Updated On : January 21, 2024 / 10:36 AM IST

Hanuman : ఈ సంక్రాంతికి వచ్చిన ‘హనుమాన్’ సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ రోజు ముందు ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకొని పాన్ ఇండియా వైడ్ దూసుకుపోతుంది. ఇప్పటికే హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. ఇంకా థియేటర్స్ హౌస్ ఫుల్ అవుతున్నాయి.

అయితే హనుమాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిత్రయూనిట్ ఈ సినిమాకు అమ్ముడైన టికెట్స్ నుంచి ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున అయోధ్య రామమందిరానికి(Ayodhya Ram Mandir) విరాళం ఇస్తాము అని ప్రకటించారు. ఈ విషయంలో కూడా చిత్రయూనిట్ కి దేశవ్యాప్తంగా అభినందనలు వచ్చాయి. హనుమాన్ సినిమా రిలీజ్ కి ముందు రోజు వేసిన ప్రీమియర్స్ లో దాదాపు 2 లక్షల 85 వేల టికెట్స్ వరకు అమ్ముడవ్వగా ఇచ్చిన మాట ప్రకారం అన్ని టికెట్స్ నుంచి 5 రూపాయల చొప్పున అంటే ఆల్మోస్ట్ రూ.14.25 లక్షలను అయోధ్య రామమందిరానికి చెక్ రూపంలో అందచేస్తాం అని సినిమా సక్సెస్ మీట్ లో తెలిపారు. అదేరోజు హనుమాన్ సినిమా థియేటర్స్ లో నడిచినన్ని రోజులు ప్రతి టికెట్ పై 5 రూపాయలు అయోధ్యకు ఇస్తామని కూడా తెలిపారు.

Also Read : Hanuman : ప్రభాస్, మహేష్, చరణ్, బన్నీ.. అందరి రికార్డులు బద్దలుకొట్టేసిన ‘హనుమాన్’.. వారెవ్వా.. కలెక్షన్స్‌లో హవా..

తాజాగా ఇప్పటివరకు అమ్ముడైన టికెట్స్ వాటి నుంచి అయోధ్యకు ఇచ్చే అమౌంట్ ని చిత్ర యూనిట్ ప్రకటించారు. హనుమాన్ సినిమాకి ఇప్పటివరకు 53,28,211 టికెట్స్ అమ్ముడవ్వగా ప్రతి టికెట్ కి 5 రూపాయల చొప్పున 2,66,41,055 రూపాయలను అయోధ్య రామమందిరానికి ఇవ్వనున్నట్టు అధికారికంగా ప్రకటించారు చిత్రయూనిట్. ఇకపై అమ్ముడయ్యే టికెట్స్ మీద కూడా 5 రూపాయల చొప్పున ఇవ్వనున్నారు. దీంతో మరోసారి హనుమాన్ చిత్రయూనిట్ ని అభినందిస్తున్నారు.