Happy Birthday Krishna : నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు – మహేష్ బాబు

నాన్న జన్మదిన శుభాకాంక్షలు..నాన్న..నువ్వు..నాకు ఎప్పుడు ఉన్నతమైన దారినే చూపిస్తున్న థాంక్స్ తెలియచేస్తున్నా..మీకు తెలిసిన దాని కంటే..ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది’ అంటూ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు...ట్విట్టర్ వేదికగా...తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు బర్త్ డే విషెస్ తెలియచేశారు.

Happy Birthday Krishna : నాన్నకు జన్మదిన శుభాకాంక్షలు – మహేష్ బాబు

Mahesh

Updated On : May 31, 2021 / 10:30 AM IST

Mahesh Babu Tweet : ‘నాన్న.. జన్మదిన శుభాకాంక్షలు.. నాకు ఎప్పుడు ఉన్నతమైన దారినే చూపిస్తున్న మీకు థాంక్స్ తెలియచేస్తున్నా..మీకు తెలిసిన దాని కంటే..ఎక్కువే నా ప్రేమ మీ మీద ఉంటుంది’ అంటూ టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు…ట్విట్టర్ వేదికగా…తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు బర్త్ డే విషెస్ తెలియచేశారు. 2021, మే 31వ తేదీ కృష్ణ జన్మదినం. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఈ సందర్భంగా..మహేష్ బాబు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ప్రతి సంవత్సరం తన తండ్రి కృష్ణ..బర్త్ డే సందర్భంగా..మూవీస్ కు సంబంధించిన లెటెస్ట్ అప్ డేట్ మహేష్ ఇస్తుంటారనే సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కరోనా సిచువేషన్ వల్ల..ఎలాంటి అప్ డేట్ ఇవ్వడం లేదు. ఆయన న్యూ ఫిల్మ్…సర్కార్ వారి పాట చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దర్శకుడు పరుశురామ్. ప్రస్తుతం షూటింగ్ కొనసాగుతోంది. దర్శకుడు పరశురామ్ ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించాలనే ప్రయత్నంలో ఉన్నారు. అవినీతికి సంబంధించిన సామాజిక అంశాన్ని ఈ సినిమాలో ప్రస్తావిస్తారని తెలుస్తోంది. ఈ ఫిల్మ్ అయిన అనంతరం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం, రాజమౌళి దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు.

Read More : Tarzan Star Dead :సరస్సులో కూలిన విమానం.. టార్జాన్ స్టార్ దుర్మరణం