Hara Om Hara : హీరో సుమన్ చేతుల మీదుగా ‘హర ఓం హర’ టైటిల్ లోగో విడుదల..
నటుడిగా, హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా పలు శాఖల్లో పని చేసిన షేర్ 'హర ఓం హర' సినిమాతో రాబోతున్నాడు. హీరో సుమన్ చేతుల మీదుగా 'ఈ మూవీ టైటిల్ లోగో విడుదల అయ్యింది.

Hara Om Hara movie title logo released by hero suman
Hara Om Hara : యూవీటీ స్టూడియోస్ హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ, శ్రియా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ‘హర ఓం హర’ అనే సినిమాను నిర్మిస్తున్నాయి. కనిక, ఆమని, రవివర్మ, జ్యోతి రెడ్డి, మేక రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను దేవేంద్ర మదన్ సింగ్ నేగి, అశోక్ ఖుల్లార్ నిర్మిస్తుండగా.. షేర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు షేర్ దర్శకత్వం వహించడమే కాకుండా.. ఓ ముఖ్య పాత్రను కూడా పోషిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రాబోతోన్న ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగోను తాజాగా రిలీజ్ చేశారు.
HER Movie : రుహాణి శర్మ నటించిన HER మూవీ నుంచి ధీరే ధీరే పాట విడుదల..
హీరో సుమన్, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) చైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్, టీఎఫ్‌సీసీ వైస్ చైర్మన్ గురు రాజ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా మేకర్లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ టైటిల్ లోగోని రిలీజ్ చేసిన సుమన్.. “సినిమా మంచి విజయం సాధించాలని, దర్శకుడు షేర్ ఈ సినిమాతో మరో స్థాయికి వెళ్ళాలి” అంటూ చిత్ర యూనిట్ కి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. అలాగే ప్రతాని రామకృష్ణ గౌడ్, గురురాజ్ కూడా మూవీ టీంకి తన అభినందనలు తెలియజేశారు.
Niharika – Chaitanya : నాలుగు నెలల తర్వాత నిహారిక భర్త చైతన్య వైరల్ పోస్ట్.. మెడిటేషన్ సెంటర్‌లో!

Hara Om Hara movie title logo released by hero suman
ఇక షేర్ మాట్లాడుతూ.. నటుడిగా, హీరోగా, విలన్‌గా, దర్శకుడిగా ఇలా పలు శాఖల్లో పని చేసిన తనకి ఇండస్ట్రీలో భాష్య శ్రీ, డైరెక్టర్ బాలా ఎంతో సపోర్ట్‌గా నిలిచారని తెలియజేశాడు. ఈ సినిమాకి షేర్ దర్శకత్వ బాధ్యతలతో పాటు సంగీత దర్శకుడిగానూ వ్యవహరించాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు పాటలను అందించిన భాష్య శ్రీ ఈ సినిమాకు పాటల రచయితగా వ్యవహరిస్తున్నారు. కావేటి ప్రవీణ్ కెమెరామెన్‌గా, డీవీ ప్రభు ఎడిటర్‌గా పని చేస్తున్న ఈ సినిమాలో జబర్దస్త్ రాకేష్, జబర్దస్త్ కట్టప్ప, వైజాగ్ షరీఫ్, షెల్జా, నేహా బెన్, సంగీత, విలన్‌గా ప్రకాష్ నాగ్, షేర్ వంటి వారు నటిస్తున్నారు.