లైంగిక వేధింపులు: బాలీవుడ్ దర్శకుడిపై ఆరోపణలు

బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీపై లైంగిక వేధింపుల ఆరోపణలు

  • Published By: chvmurthy ,Published On : January 13, 2019 / 01:58 PM IST
లైంగిక వేధింపులు: బాలీవుడ్ దర్శకుడిపై ఆరోపణలు

Updated On : January 13, 2019 / 1:58 PM IST

బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీపై లైంగిక వేధింపుల ఆరోపణలు

ఢిల్లీ:దేశంలో మీటూ ఉద్యమం ఆరోపణలు సర్దుమణిగాయి అనుకునే లోపల బాలీవుడ్ లో ఓ ప్రముఖ దర్శకుడు గత ఆరు నెలలుగా లైంగికంగా వేధిస్తున్నారని, ఆయన దగ్గర పనిచేస్తున్న మహిళా సహాయ దర్శకురాలు ఆరోపించటంతో సినీపరిశ్రమలో మళ్లీ ఒక్కసారిగా నిప్పురాజుకుంది.
ప్రముఖ బాలీవుడ్ దర్శుకుడు రాజ్ కుమార్ హిరాణీ  తననుల ఆరునెలలుగా లైంగికంగా వేధిస్తున్నరంటూ ఆయన వద్ద  “సంజూ” సినిమాకు సహాయదర్శకురాలిగా పని చేసిన యువతి ఆరోపించింది.  సంజూ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో  హిరాణీ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపణ.   ఈ విషయాన్ని ఆమె చిత్ర నిర్మాథ  విధువినోద్ చోప్రాకు,  అతని సోదరి, భార్యకు మెయిల్ చేసినట్లు తెలిసింది. 
ఆ మహిళ పంపించిన మెయిల్ లో ” సర్  నా పట్ల జరిగినది చాలా పెద్ద తప్పు. హిరాణీ చాలా పెద్ద దర్శకులు, నేను ఆయన వద్ద పని చేస్తున్న సహాయదర్శకురాలిని,  ఆయన నా పై చేసిన  దారుణాన్ని ఎవరికీ చెప్పుకోలేను. ఆయన కారణంగా నా మనసు, శరీరం పాడైపోయాయి.  ఆరు నెలల పాటు హిరాణీ నన్ను లైంగికంగా వేధించారు. ఉద్యోగాన్ని పోగొట్టుకోలేక మౌనంగా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ ఈ ఉద్యోగాన్ని వదిలేసినా మరో ఉద్యోగం దొరకదేమోనన్న భయం. ఆయన నా పనితనం పట్ల బయట తప్పుగా మాట్లాడతారేమోననే భయంతో, తప్పని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సివచ్చింది’’ అని ఆమె మెయిల్‌ ద్వారా తన భాధను వ్యక్తపరిచారు. 
తనపై వచ్చిన ఆరోపణలను రాజ్ కుమార్ హిరాణీ ఖండించారు.  హిరాణీ న్యాయవాది  ఆనంద్ దేశాయ్  లైంగిక ఆరోపణలపై మాట్లాడుతూ..  హిరాణీపై వస్తున్న ఆరోపణలలో  నిజంలేదని, ఆయనపై ఎవరో కావాలనే  ఇలా చేయిస్తున్నారని ఆరోపించారు.