Harish Shankar – Konda Surekha : మొదలుపెట్టింది మీరే.. ముగించాల్సిన బాధ్యత మీదే.. మంత్రి కొండా సురేఖపై హరీష్ శంకర్ ట్వీట్..
హరీష్ శంకర్ కొండా సురేఖ వ్యాఖ్యలకు, మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్వీట్ చేశారు.

Harish Shankar Tweet on Konda Surekha Comments
Harish Shankar – Konda Surekha : కొండా సురేఖ సమంత, నాగ చైతన్యల పేర్లు ప్రస్తావిస్తూ చేసిన ఆరోపణలపై టాలీవుడ్ ఫైర్ అవుతుంది. సినీ పరిశ్రమలోని స్టార్స్, నటీనటులు, ప్రముఖులు అందరూ కొండా సురేఖ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కొండా సురేఖ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను అని చెప్పడంతో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఈ విషయాన్ని ఇంతటితో ఆపేయమని సినీ పరిశ్రమకు రిక్వెస్ట్ చేసాడు.
Also Read : Mahesh Babu – Konda Surekha : ఆ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి.. కొండా సురేఖ వ్యాఖ్యలపై మహేష్ బాబు ట్వీట్..
దీంతో హరీష్ శంకర్ కొండా సురేఖ వ్యాఖ్యలకు, మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్వీట్ చేశారు.
హరీష్ శంకర్ తన ట్వీట్ లో.. అక్కినేని నాగార్జున గారి కుటుంబంపై కొండా సురేఖ గారు మాట్లాడిన తీరు చాలా బాధాకరం. రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వారిని టార్గెట్ చేయడం శోచనీయం. రాష్ట్రాలకు ఎప్పడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చే సినిమా వారిని చులకన చేస్తూ మాట్లాడడం చాలా తప్పుడు సంప్రదాయం. సురేఖ గారు ఇది మొదలెట్టింది మీరే దీన్ని సంస్కారవంతంగా ముగించాల్సిన బాధ్యత కూడా మీదే అని రాసుకొచ్చారు.
అక్కినేనినాగార్జున గారి కుటుంబం పై కొండా సురేఖ గారు మాట్లాడిన తీరు చాలా బాధాకరం … రాజకీయ ప్రయోజనాల కోసం సినిమా వారిని టార్గెట్ చేయడం శోచనీయం …
రాష్ట్రాలకు ఎప్పడు ఏ విపత్తు వచ్చినా మేమున్నామంటూ ముందుకు వచ్చే సినిమా వారిని చులకన చేస్తూ మాట్లాడడం …. చాలా తప్పుడు సంప్రదాయం……
— Harish Shankar .S (@harish2you) October 3, 2024