Mahesh Babu – Konda Surekha : ఆ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి.. కొండా సురేఖ వ్యాఖ్యలపై మహేష్ బాబు ట్వీట్..

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్వీట్ చేసాడు.

Mahesh Babu – Konda Surekha : ఆ వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి.. కొండా సురేఖ వ్యాఖ్యలపై మహేష్ బాబు ట్వీట్..

Super Star Mahesh Babu Reacts on Konda Surekha Comments Tweet goes Viral

Updated On : October 3, 2024 / 2:06 PM IST

Mahesh Babu – Konda Surekha : మంత్రి కొండా సురేఖ నాగ చైతన్య, సమంతలను ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై టాలీవుడ్ అంతా విమర్శిస్తోంది. సినీ పరిశ్రమలోని స్టార్ హీరోల నుంచి చిన్న నటీనటుల వరకు అంతా కొండా సురేఖ వ్యాఖ్యలను తప్పుపడుతూ ట్వీట్స్ చేస్తున్నారు.

తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కొండా సురేఖ వ్యాఖ్యలపై స్పందిస్తూ ట్వీట్ చేసాడు.

Also Read : Konda Surekha – RGV : కొండా సురేఖ వ్యాఖ్యలకు ఆర్జీవీ కౌంటర్.. సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇవ్వాలి..

మహేష్ బాబు తన ట్వీట్ లో.. మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపై చేసిన వ్యాఖ్యలు చాలా బాధ కలిగించాయి. ఒక కూతురి తండ్రిగా, భార్యకు భర్తగా, తల్లికి కొడుకుగా ఓ మహిళా మంత్రి మరో మహిళపై చేసిన ఆమోదయోగ్యంకాని వ్యాఖ్యలు, భాష పట్ల తీవ్రంగా బాధపడ్డాను. ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయనంత వరకు వాక్‌ స్వేచ్ఛను ఉపయోగించుకోవచ్చు. మీరు చేసిన నిరాధారమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అలాగే సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్‌గా మార్చుకోవద్దని ప్రజాక్షేత్రంలో ఉండే వ్యక్తులను అభ్యర్థిస్తున్నాను. మన దేశంలోని మహిళలను, మన సినీ సోదరులను గౌరవంగా చూడాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్ చేశారు.