Hema Malini : ధర్మేంద్రతో విడిపోయి బ్యాడ్‌గా ఫీల్ అవ్వలేదన్న హేమామాలిని
ధర్మేంద్ర-హేమ మాలిని స్క్రీన్ పైనే కాదు.. జీవితాన్ని పంచుకున్నారు. ఏవో స్పర్థల కారణంగా విడిపోయారు. ధర్మేంద్రతో కలిసి ఉండకపోవడంపై హేమ మాలిని తాజాగా కొన్ని వ్యాఖ్యలు చేసారు.

Hema Malini
Hema Malini : ఒకప్పుడు తన అందం, నటనతో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన నటి హేమా మాలిని. ప్రస్తుతం ఆమె భర్త ప్రముఖ నటుడు ధర్మేంద్ర నుంచి విడిపోయి సెపరేట్‌గా ఉంటున్నారు. రీసెంట్‌గా మీడియాతో మాట్లాడిన ఆమె తన కుటుంబ విషయాలు షేర్ చేసుకున్నారు.
ధర్మేంద్రకి దూరంగా ఉండటంపై హేమ మాలిని స్పందించారు. ఆ విషయంపై తాను బాధపడటం లేదని చెప్పారు. పెళ్లి తరువాత భర్తను వదిలి తన సొంత ఇంట్లో ఉండే స్త్రీని ఫెమినిజంకి చిహ్నంగా పిలుస్తారని.. ఎవరూ అలా ఉండాలని కోరుకోరు అని హేమ మాలిని అన్నారు. ఎవరికి వారు జీవితాన్ని గడపాలని అనుకోరు.. ప్రతి స్త్రీ కూడా భర్త కావాలని కోరుకుంటుంది.. కానీ ఎక్కడో మా బంధం దారి తప్పింది.. అని చెప్పుకొచ్చారామె. తన ఇద్దరు పిల్లల ఈషా, అహానాకి ధర్మేంద్ర తండ్రిగా ఎప్పుడూ ఉంటారని.. వారి పెళ్లిళ్లు సరైన సమయం వచ్చినపుడు జరుగుతాయని అన్నారు హేమ మాలిని.
Allu Arjun : బాలీవుడ్ హీరోలతో పోలుస్తూ అల్లు అర్జున్ పై హేమ మాలిని ప్రశంసలు..
1980 లలో టాప్ ఫిల్మ్ స్టార్ అయిన హేమ మాలినిని ధర్మేంద్ర వివాహం చేసుకున్నారు. వారికి ఈషా-అహానా ఇద్దరు పిల్లలు. సినిమాల్లోకి రాకముందే 1954 లోనే ధర్మేంద్ర.. ప్రకాష్ కౌర్‌ను 19 సంవత్సరాల వయసులో పెళ్లాడారు. వారికి సన్నీ, బాబీ, విజేత, అజీత అనే నలుగురు పిల్లలు ఉన్నారు. రీసెంట్‌గా సన్నీ డియోల్ కుమారుడు కరణ్ పెళ్లి జరిగింది. అయితే ఈ వేడుకకు హేమ మాలిని, ఆమె కుమార్తెలు హాజరు కాలేదు.