షారుఖ్ 365 రోజులూ ఇష్టంగా తినే డిష్ ఏంటో తెలుసా?

  • Published By: sekhar ,Published On : August 25, 2020 / 03:38 PM IST
షారుఖ్ 365 రోజులూ ఇష్టంగా తినే డిష్ ఏంటో తెలుసా?

Updated On : August 25, 2020 / 4:16 PM IST

Shah Rukh Khan Food Habits: బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్‌ ఫేవరెట్ డిష్ ఏంటో తెలుసా?.. ఆ ఐటెం 365 డేస్ పెట్టినా ఎంచక్కా లాగించేస్తాడట.. ఇంతకీ ఏంటా వంటకం.. తన డైట్ గురించి ఫుడ్ మెనూ గురించి షారుఖ్ ఏం చెప్పాడో ఆ వివరాలు మీకోసం..



షారుఖ్ ఉత్తరాది నేపథ్యం కలిగిన వ్యక్తి కాబట్టి స్వతాహా కొన్ని స్పెషల్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి. తనకు తందూరి చికెన్ అంటే చాలా ఇష్టం అంట.. ఎంతిష్టమంటే 365 రోజులూ పెట్టినా ఇష్టంగా తింటాడట.. షూటింగ్ లొకేషన్లో ప్రొడక్షన్ ఫుడ్ అస్సలు ముట్టుకోడట.. ఇంటిచుట్టు పక్కల ప్రాంతాల్లో షూటింగ్ అయితే లంచ్ ఇంటి దగ్గరినుంచే వస్తుందట.



మిగతారోజుల్లో లేటుగా నిద్రలేవడంతో బ్రేక్‌ఫాస్ట్ చేయడట.. ఎగ్ వైట్స్, ఒకగ్లాస్ ఆరెంజ్ జ్యూస్, విటమిన్ టాబ్లెట్‌తో తన డే స్టార్ట్ చేస్తాడట. అలాగే లంచ్, డిన్నర్‌లో తందూరి చికెన్, తందూరి రోటీతో పాటు కొన్ని మటన్ ఐటమ్స్ కూడా కచ్చితంగా ఉండాల్సిందేనట. ప్రొటీన్‌కి సంబంధించినంత వరకు మాత్రమే కొన్ని వెజిటబుల్ పదార్థాలు తీసుకుంటాడ షారుఖ్.