ఆంధ్రా నాదే – తెలంగాణా నాదే

ఏపీ సీఎమ్ నారా చంద్రబాబు నాయుడు గురించి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

  • Published By: sekhar ,Published On : January 30, 2019 / 11:21 AM IST
ఆంధ్రా నాదే – తెలంగాణా నాదే

Updated On : January 30, 2019 / 11:21 AM IST

ఏపీ సీఎమ్ నారా చంద్రబాబు నాయుడు గురించి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

ఏపీ సీఎమ్ నారా చంద్రబాబు నాయుడు గురించి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. రీసెంట్‌గా అనంతపురం జిల్లాలోని ఎర్రమంచిలిలో కియా కార్ల సంస్థని ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని గురించి చంద్రబాబు.. కొన్నేళ్ళ క్రితం అనంతపురం జిల్లాలో పరిశ్రమలు వస్తాయంటే ఎవరూ నమ్మలేదు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కష్టపడి, జిల్లాకి తాగునీరు అందించింది. ఇప్పుడు కియా కార్ల రూపంలో మరో అడుగు ముందుకేసింది. ఇక ముందు ఇక్కడికి మరిన్ని పరిశ్రమలు తరలివస్తాయి.. అని ట్వీట్ చెయ్యగా….

రామ్.. అవును నిజమే, మన రాష్ట్రానికిది భారీ ముందడుగు. ముందు ముందు ఇలాంటివి ఇంకెన్నో వస్తాయి అని ట్వీట్ చేసాడు. రామ్ ఈ ట్వీట్ చెయ్యగానే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుండి ఏపీకి మద్దతు తెలుపుతున్న ఒకే ఒక్క హీరో రామ్ అంటూ నెటిజన్స్ అతణ్ణి పొగిడారు. వారి పొగడ్తలపై రామ్, నా ఇల్లు సక్కబెట్టేటోడు ఎవరైతే నాకేంటన్నాయ్.. నువ్వు మంచి చెయ్, నీకూ ఇస్తా ఓ ట్వీటు.. ఆంధ్రా నాదే, తెలంగాణా నాదే.. ఇదే మాట మీద ఉంటా.. ఇక్కడ కులం లేదు, ప్రాంతం లేదు, చర్చ అస్సలు లేదు.. ముందు నేను పౌరుడిని, ఆ తర్వాతే నటుణ్ణి అంటూ రెస్పాండ్ అయ్యాడు.