నేనూ ఇంటర్ పూర్తి చెయ్యలేదు : రామ్ ట్వీట్ వైరల్

ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇక్కడితో జీవితం ఏం ఆగిపోదు.. అంటూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది..

  • Published By: sekhar ,Published On : April 24, 2019 / 09:39 AM IST
నేనూ ఇంటర్ పూర్తి చెయ్యలేదు : రామ్ ట్వీట్ వైరల్

Updated On : April 24, 2019 / 9:39 AM IST

ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇక్కడితో జీవితం ఏం ఆగిపోదు.. అంటూ రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది..

ఎనర్జిక్ స్టార్ రామ్ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. మొన్నామధ్య ఏపీ సీఎమ్ చంద్రబాబుకి సపోర్ట్‌గా రామ్ చేసిన ట్వీట్ వైరల్ అయిన సంగతి తెలిసిందే. రీసెంట్‌గా రామ్ చేసిన మరో ట్వీట్ సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతుంది. ఇంతకీ రామ్ ఏమని ట్వీట్ చేసాడంటే..
తెలంగాణా రాష్ట్రంలో ఇంటర్ రిజల్ట్ విద్యార్థుల జీవితాలను అతలాకుతలం చేసేసింది. 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచి వేసింది.. ఈ సంఘటన గురించి హీరో రామ్ తన స్టైల్‌లో రెస్పాండ్ అయ్యాడు. ఇంటర్ పూర్తికాని సచిన్ టెండూల్కర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. అని విష్ చేస్తూ, నేను కూడా ఇంటర్ పూర్తి చెయ్యలేదు అని ట్వీట్ చేసాడు..

చదువులో ఫెయిల్ అయినంత మాత్రన ప్రాణాలు తీసుకుని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగల్చడం సరైనపని కాదని చెప్పాడు రామ్.. ఇంటర్ పూర్తి చెయ్యని సచిన్ ఎన్ని సంచలనాలు సృష్టించాడో చూడండి, ఇంటర్ ఫెయిల్ అయినంత మాత్రాన ఇక్కడితో జీవితం ఏం ఆగిపోదు.. అంటూ విద్యార్థులను సపోర్ట్ చేస్తూ,  ఎంకరేజ్ చేస్తూ, మేటర్ వాళ్ళకి అర్థమయ్యేలా రామ్ చేసిన ట్వీట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.