Ravi Teja: నో రిటైర్మెంట్.. నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే.. రవి తేజ ఎమోషనల్ కామెంట్స్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న సినిమా (Ravi Teja)"మాస్ జాతర". డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు.

Ravi Teja: నో రిటైర్మెంట్.. నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే.. రవి తేజ ఎమోషనల్ కామెంట్స్

Hero Ravi Teja makes emotional comments on his retirement

Updated On : October 30, 2025 / 5:40 PM IST

Ravi Teja: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కిస్తున్న సినిమా “మాస్ జాతర”. డాన్సింగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 31న ప్రేక్షకుల (Ravi Teja)ముందుకు రానుంది. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హీరో రవి తేజ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

Rashmi Gautam: క్రేజీ ఫోజులిచ్చిన యాంకరమ్మ.. రష్మీ క్యూట్ ఫోటోలు

ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ..”మాస్ జాతర సినిమా విడుదల కొంచెం లేట్ అయ్యింది. కొన్నిసార్లు నాకు తగిలిన గాయాల వల్ల లేట్ అయితే.. కొన్నిసార్లు వేరే కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. సంక్రాంతికి అనుకున్నాం, వేసవికి అనుకున్నాం, వినాయక చవితి అనుకున్నాం, చివరికి దసరా, దీపావళి కూడా మిస్ అయ్యింది. నా కెరీర్ లో ఏ సినిమా కూడా ఇంత లేట్ అవలేదు. ఎట్టకేలకు సరైన సమయంలోనే వస్తున్నాం. జయాపజయాలను నేను పెద్దగా పట్టించుకోను. పని చేయడమే నాకు తెలిసింది.

వందశాతం కష్టపడి పని చేస్తే ఫలితం అదే వస్తుందని నేను నమ్ముతాను. నేను నటనకు రిటైర్మెంట్‌ తీసుకోను. నా చివరి శ్వాస వరకూ నటిస్తూనే ఉంటాను” అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు. దీంతో ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా తరువాత రవి తేజ దర్శకుడు కిషోర్ కుమార్ తిరుమలతో ఓ మూవీ చేయనున్నాడు. ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.