శివ కార్తికేయన్ ‘హీరో’ డిసెంబర్ 20న విడుదల

శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘హీరో’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది..

  • Published By: sekhar ,Published On : November 28, 2019 / 05:34 AM IST
శివ కార్తికేయన్ ‘హీరో’ డిసెంబర్ 20న విడుదల

Updated On : November 28, 2019 / 5:34 AM IST

శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. PS మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘హీరో’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది..

కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్, కల్యాణి ప్రియదర్శన్ జంటగా.. PS మిత్రన్ దర్శకత్వంలో, కేజేఆర్ స్టూడియోస్ నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్.. ‘హీరో’.. ‘యాక్షన్ కింగ్’ అర్జున్, బాలీవుడ్ నటుడు అభయ్ డియోల్, ఇవానా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభించింది.

Image

గురువారం సినిమాలోని కొత్త స్టిల్స్ రిలీజ్ చేశారు. విశాల్ నటించిన ‘ఇరుంబు తిరై’ (తెలుగులో అభిమన్యుడు) సినిమాతో ప్రశంసలందుకున్న మిత్రన్ ‘హీరో’ చిత్రాన్ని కూడా, ఓ బర్నింగ్ పాయింట్‌తో మంచి మెసేజ్‌తో తెరకెక్కించబోతున్నాడని తెలుస్తోంది.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ‘హీరో’ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న విడుదల కానుంది. సంగీతం : యువన్ శంకర్ రాజా, కెమెరా : జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్ : రూబెన్, స్టంట్స్ : దిలీప్ సుబ్బరాయన్, కొరియోగ్రఫీ : రాజు సుందరం, సతీష్.