శివ – సూర్య కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్ టైనర్
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఒకవైపు ఆయన నటించిన ‘ఎన్.జి.కె’, ‘కాప్పాన్’ మూడు నెలల గ్యాప్ లో మే 31న, ఆగస్టు 30న వరుసగా విడుదల కానున్నాయి.

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఒకవైపు ఆయన నటించిన ‘ఎన్.జి.కె’, ‘కాప్పాన్’ మూడు నెలల గ్యాప్ లో మే 31న, ఆగస్టు 30న వరుసగా విడుదల కానున్నాయి.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస చిత్రాలతో బిజీ అవుతున్నాడు. ఒకవైపు ఆయన నటించిన ‘ఎన్.జి.కె’, ‘కాప్పాన్’ మూడు నెలల గ్యాప్ లో మే 31న, ఆగస్టు 30న వరుసగా విడుదల కానున్నాయి. మరోవైపు… ‘గురు’ (వెంకటేష్) చిత్ర దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి సూర్య సన్నాహాలు చేసుకుంటున్నాడు. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది.
Read Also : మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ : బుద్ధా..నోరు ఉంది కదా అని పారేసుకోకండి
సూర్య మొత్తానికి హిట్టు ప్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు అంగీకరిస్తూ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా దర్శకుడు శివ చెప్పిన కథకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా పక్కా యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ గానే రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
కాగా శివ గోపీచంద్ ‘శౌర్యం’ సినిమాతోనే డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. ఇక ఇటీవలే తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా ‘విశ్వాసం’ను తెరకెక్కించి తమిళంలో భారీ విజయాన్ని అందుకున్నాడు. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. మరి మరి శివ – సూర్య కాంబినేషన్ లో వచ్చే సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ హిట్ అవుతుందేమో చూడాలి.
Read Also : Fans Upset : అవెంజర్స్.. ఎండ్ గేమ్ : రెహమాన్ ‘మార్వెల్’సాంగ్ రిలీజ్