Annapurna Photo Studio Trailer : ఊహకందని మలుపులు.. పల్లె ప్రేమకథ.. రౌడీ హీరో చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. చెందు ముద్దు దర్శకత్వంలో బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు.

Annapurna Photo Studio
Annapurna Photo Studio : చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’. చెందు ముద్దు దర్శకత్వంలో బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని నిర్మించారు. మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య కీలక పాత్రల్లో నటించగా ఇటీవల విడుదల చేసిన పాటలు, టీజర్‌తో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తాజాగా హీరో విజయ్‌దేవరకొండ (Vijay Devarakonda) చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ విడుదలైంది.
Prabhas : ప్రాజెక్ట్ Kలో మహా విష్ణువు అవతారంలో కనిపించనున్న ప్రభాస్..!

Vijay Devarakonda Launched APS Trailer
అనంతరం విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ట్రైలర్‌ను ఇప్పుడే లాంచ్ చేశాను. రంగమ్మ అనే పాట రెట్రో ఫీలింగ్‌ను ఇచ్చిందన్నారు. టీజర్ నచ్చిందని, ట్రైలర్ అద్భుతంగా ఉందన్నారు. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా జూలై 21న వస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని చూడాలని కోరారు. చిత్ర బృందానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. బిగ్ బెన్ స్టూడియోస్ తన రీర్‌లో ఎంతో ఇంపార్టెంట్ అని, ఈ స్టూడియో స్ వల్లే తన పెళ్లి చూపులు చిత్రం విడుదలైందని, యశ్ మామకు ఆల్ ది బెస్ట్ అని విజయ్ దేవరకొండ అన్నారు.
Dhanush : ఆ పని చేసినందుకు ధనుష్ పై త్వరలో బ్యాన్..? అదే జరిగితే..
ట్రైలర్ చూస్తుంటే అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. కామెడీ, ప్రేమ, సస్పెన్స్, థ్రిల్లర్, క్రైమ్ డ్రామా ఇలా అన్నీ ఉన్నాయి. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో 80,90ల నాటి వాతావరణాన్ని చాలా చక్కగా చూపించారు. నటీనటులు నటన ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమోరా వర్క్ ఇలా అన్ని చక్కగా కుదిరాయి. మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంటోంది.