‘చంపేశావు కదా!’ సమ్మోహనం సుందరి ‘అదితి పలావ్’..

తన అందం..నటనతో తెలుగు ప్రేక్షకులను ‘సమ్మోహనం’పరిచిన హీరోయిన్ అదితీరావు హైదరీ ‘అంతరిక్షం’తోనూ తనదైనశైలిలో నటించింది. అదితి రావు సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటుంది. బాలీవుడ్‌లో కూడా చక్కటి పేరు తెచ్చుకున్న ఈ అమ్మాయి తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫొటోను పోస్ట్ చేసింది. ఓ ప్లేటులో పలావ్ వుండగా.. దాని మధ్యలో అదితిరావు ఫొటో వచ్చేలా క్రియేట్ చేశాడు అదితీ అభిమాని.
?????? died. ??????? https://t.co/KR76OhNZ69
— Aditi Rao Hydari (@aditiraohydari) July 21, 2020
దానికి 'అదితి పలావ్' అంటూ పేరు పెట్టాడు గుహాన్ అనే ఆ అభిమాని. తన అభిమాని పోస్ట్ చేసిన ఈ ఫొటోను అదితిరావ్ తన ట్విట్టర్ ఖాతాలో రీట్వీట్ చేస్తూ.. చక్కటి సమయస్పూర్తితో ‘చంపేశావు కదా!' అంటూ నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేసింది. కాగా అందం అభినయం కలబోసిన ఈ అమ్మాయి ప్రస్తుతం వెబ్ సిరీస్‌లతోనూ బిజీ బిజీగా ఉంది. అన్నట్లు ఈ సమ్మోహన సుందరి హైదరాబాదుకు చెందిన ఓ జమిందారీల కుటుంబం వారసురాలనే విషయంతెలిసిందే.