Sunainaa : హాస్పిటల్ బెడ్‌పై హీరోయిన్.. చేతికి సెలైన్‌తో.. ఆందోళనలో అభిమానులు..
సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే సునైనా తాజాగా ఓ రెండు ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Heroine Sunainaa Hospitalized Photos goes Viral
Sunainaa : హీరోయిన్ సునైనా.. తెలుగులో కుమారి వర్సెస్ కుమారి అనే సినిమాతోనే సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల విశాల్ లాఠీ, శ్రీవిష్ణు రాజరాజచోర సినిమాలు సునైనాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలతో బిజీగా అంది సునైనా. అయితే తాజాగా సునైనా హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.
Also Read : Pooja Hegde : మాల్దీవ్స్ టెన్నిస్ కోర్టులో స్టైలిష్‌గా కష్టపడుతున్న పూజా హెగ్డే.. ఫెదరర్ కోసం అంటూ..
సినిమాలతో బిజీగా ఉంటూ సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉండే సునైనా తాజాగా ఓ రెండు ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది. హాస్పిటల్ బెడ్ పై పడుకొని, చేతికి సెలైన్ పెట్టించుకుని ఉంది. ఈ ఫోటోలని షేర్ చేసి.. త్వరలోనే ధృడంగా తిరిగి వస్తాను అని పోస్ట్ చేసింది. దీంతో ఆమె అభిమానులు, పలువురు నెటిజన్లు.. ఆమెకి ఏమైంది? ఎందుకు హాస్పిటల్ లో చేరింది అని ప్రశ్నిస్తూ త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటున్నారు. సునైనా ఏ సమస్యతో హాస్పిటల్ లో చేరిందో మాత్రం చెప్పలేదు.