Venuswamy : నాగచైతన్య శోభిత విషయంలో.. వేణుస్వామికి తెలంగాణ హైకోర్ట్ షాక్..
నాగచైతన్య - శోభిత కూడా విడాకులు తీసుకుంటారని నిశ్చితార్థం అయినప్పుడే వ్యాఖ్యలు చేసాడు వేణుస్వామి.

High Court lift Stay on Mahila Commission Notice regarding Venuswamy Issue about Naga Chaitanya Sobhita
Venuswamy : ఇటీవల నాగ చైతన్య శోభితతో నిచ్చితార్ధం చేసుకొని త్వరలోనే రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడు. అయితే ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గతంలో సమంత – చైతన్య మీద కామెంట్స్ చేసినట్టే ఈసారి కూడా నాగచైతన్య – శోభిత కూడా విడాకులు తీసుకుంటారని నిశ్చితార్థం అయినప్పుడే వ్యాఖ్యలు చేసాడు.
వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్ అవ్వగా అక్కినేని ఫ్యాన్స్ మండిపడ్డారు. అలాగే శోభిత, సమంత.. ఇలా సినిమా మహిళల పర్సనల్ విషయాలపై కామెంట్స్ చేస్తున్నందుకు గాను కొన్ని రోజుల క్రితం ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు మహిళా కమిషన్ వేణుస్వామికి నోటీసులు ఇచ్చి విచారణకు హాజరవ్వాలని చెప్పింది.
Also Read : Avinash : అవినాష్ కు డాక్టర్ చెకప్.. హెల్త్ సమస్యలతో బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేస్తున్న అవినాష్..?
అయితే వేణుస్వామి మాత్రం మహిళా కమిషన్ కు ఆ అధికారం లేదంటూ హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. తాజాగా నేడు ఆ స్టే ఎత్తివేస్తూ కమిషన్ కు పూర్తి అధికారాలున్నాయని హై కోర్ట్ తెలిపింది. అలాగే వారంలోగా వేణుస్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ కు న్యాయస్థానం స్పష్టం చేసింది. మరి వేణుస్వామి ఇప్పుడైనా మహిళా కమిషన్ ముందు హాజరవుతారా చూడాలి.