Nee Dhare Nee Katha : హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో తెరకెక్కుతున్న టాలీవుడ్ చిన్న సినిమా ‘నీదారే నీకథ’..

హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో తెరకెక్కుతున్న టాలీవుడ్ చిన్న సినిమా 'నీదారే నీకథ'. న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్ పై ట్రైనింగ్ అయిన వంశీ జొన్నలగడ్డ..

Nee Dhare Nee Katha : హాలీవుడ్ టెక్నీషియన్స్‌తో తెరకెక్కుతున్న టాలీవుడ్ చిన్న సినిమా ‘నీదారే నీకథ’..

Hollywood technicians are working for tollywood movie Nee Dhare Nee Katha

Updated On : January 29, 2024 / 8:41 PM IST

Nee Dhare Nee Katha : కొత్త టాలెంట్ తో టాలీవుడ్ పరిశ్రమ ప్రస్తుతం ఇండియాలో నెంబర్ వన్ ఇండస్ట్రీగా అనిపించుకుంటుంది. ప్రస్తుతం వస్తున్న కొత్త దర్శకులు తమ టాలెంట్ తో చిన్న బడ్జెట్ లోనే అద్భుతాలు సృష్టిస్తూ అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఆ టాలెంట్ తో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు ‘నీదారే నీకథ’ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్న దర్శకుడు వంశి జొన్నలగడ్డ కూడా ఆ కోవకు చెందినవారే.

న్యూయార్క్ ఫిలిం అకాడమీలో ఫిలిం మేకింగ్ పై ట్రైనింగ్ అయిన వంశీ జొన్నలగడ్డ.. లోకల్ టాలెంట్‌ని ఇంటర్నేషనల్ లెవెల్ కి తీసుకు వెళ్లేలా ‘నీదారే నీకథ’ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈక్రమంలోనే ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ ని ఎంపిక చేసుకున్నారు. హాలీవుడ్ చిత్రాలకు సంగీతం రికార్డింగ్ చేసిన ఇటాలియన్ మ్యూజిక్ కంపోజర్ ‘ఆల్ బర్ట్’ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు.

Also read : Koratala Siva : ఏడేళ్లుగా ‘శ్రీమంతుడు’ రచ్చ.. సుప్రీంకోర్టులో కూడా కొరటాల శివకు చుక్కెదురు..

హాలీవుడ్ బుడాపెస్ట్ స్కోరింగ్ ఆర్కెస్ట్రా ద్వారా మ్యూజిక్ చేయబడిన ఫస్ట్ ఇండియన్ మూవీగా ‘నీదారే నీకథ’ నిలిచింది. ఇక ఈ మూవీకి సినిమాట్రోగ్రాపర్ గా కూడా హాలీవుడ్ టెక్నీషియన్ నే ఎంపిక చేసుకున్నారు. ‘అలెక్స్ క ఓ’ తన విజువల్ వండర్స్ తో ఈ సినిమాని అద్భుతంగా చూపించబోతున్నారు. ఇక ఈ మూవీకి మురళి మరియు వంశీ జొన్నలగడ్డ అందమైన కథని రచించారు.

జె.వి ప్రొడక్షన్స్ పతాకం పై శైలజ జొన్నలగడ్డ, వంశి జొన్నలగడ్డ, హర్షిత తోట, తేజేష్ వీర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రీసెంట్ గా హైదరాబాదులోని నెక్సస్ మాల్ లో ఈ మూవీ యూనిట్ పరిచయ కార్యక్రమం జరగగా.. ఏఆర్ రెహమాన్ ఫౌండేషన్ ద్వారా 30 మంది యువ సంగీత వాయిద్య కళాకారులు లైవ్ ఆర్కెస్ట్రాతో మ్యూజికల్ ఫ్లాష్ మాబ్ ఇచ్చి అందర్నీ ఉర్రూతలూగించారు.

 Nee Dhare Nee Katha

Nee Dhare Nee Katha