TFI : చిత్రపరిశ్రమకు సీఎం కేసీఆర్‌ పూర్తి సహకారం.. సినీ పరిశ్రమపై హోంమంత్రి మహమూద్‌ అలీ వ్యాఖ్యలు..

తాజాగా తెలంగాణ హోంమంత్రి కూడా సినీ పరిశ్రమకి తాము పూర్తి సపోర్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘సదా నన్ను నడిపే’ అనే సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్‌ అలీ.....

TFI : చిత్రపరిశ్రమకు సీఎం కేసీఆర్‌ పూర్తి సహకారం.. సినీ పరిశ్రమపై హోంమంత్రి మహమూద్‌ అలీ వ్యాఖ్యలు..

Mahamood Ali

Updated On : March 2, 2022 / 7:11 AM IST

Tollywood : గత కొన్ని నెలలుగా తెలుగు సినీ పరిశ్రమ పేరు రెండు రాష్ట్ర రాజకీయాల్లో బాగా వినిపిస్తుంది. పరిశ్రమ వేడుకలకి రాజకీయ నాయకులు హాజరవుతున్నారు. అయితే ఒకపక్క ఏపీలో సినీ పరిశ్రమకి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని తొలిగించండి అంటూ స్టార్ హీరోలు సైతం ఏపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా పట్టించుకోని పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు తెలంగాణలో మాత్రం మంత్రులు అంతా సినిమా ఫంక్షన్స్ కి హాజరవుతూ సినిమా వాళ్ళు అడిగినవి చేస్తూ సినీ పరిశ్రమకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.

Maha Shivaratri : లాస్ ఏంజిల్స్‌లో భర్త నిక్‌తో కలిసి ప్రియాంక చోప్రా మహా శివరాత్రి పూజలు

తాజాగా తెలంగాణ హోంమంత్రి కూడా సినీ పరిశ్రమకి తాము పూర్తి సపోర్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ‘సదా నన్ను నడిపే’ అనే సినిమా టీజర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. ”సినీ పరిశ్రమకు హైదరాబాద్‌ చాలా అనుకూలంగా ఉంది. మా ప్రభుత్వం సినీ పరిశ్రమకి పూర్తి అండగా ఉంది. వచ్చే ఐదేళ్లలో చిత్ర నిర్మాణంలో హైదరాబాద్ దేశానికి మరో ముంబయిలా మారుతుంది. చిత్రపరిశ్రమకు సీఎం కేసీఆర్‌ పూర్తి సహకారం అందిస్తున్నారు” అని తెలిపారు.