Kangana – Hrithik : కంగనా సినిమా ప్రమోషన్ ప్రోమోలో హృతిక్ పై కామెంట్స్.. వీడియో వైరల్!

కంగనా నిర్మిస్తున్న 'టిక్కు వెడ్స్ షేరు' సినిమా ప్రమోషన్స్ భాగంగా రిలీజ్ చేసిన ప్రోమోలో.. హృతిక్ రోషన్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Kangana – Hrithik : కంగనా సినిమా ప్రమోషన్ ప్రోమోలో హృతిక్ పై కామెంట్స్.. వీడియో వైరల్!

Hrithik Roshan name in Kangana Ranaut produced movie Tiku Weds Sheru viral

Updated On : June 22, 2023 / 3:31 PM IST

Kangana Ranaut – Hrithik Roshan : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ ప్రస్తుతం నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా టిక్కు వెడ్స్ షేరు (Tiku Weds Sheru). మణికర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాని సాయి కబీర్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్ధిఖీ (Nawazuddin Siddiqui), అవనీత్ కౌర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పెళ్లి కథాంశంతో వస్తున్న ఈ సినిమా జూన్ 23న డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కి సిద్దమవుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్ ని నిర్మాత అయిన కంగనా స్వయంగా చూసుకుంటుంది.

Adipurush : ఆదిపురుష్ ఫెయిల్ అవ్వడానికి మొత్తం 5 రీజన్స్.. అవేంటో తెలుసా?

ఈ క్రమంలోనే ఇటీవల తన పెళ్లి అంటూ ఒక ప్రోమో వీడియో రిలీజ్ చేసి మూవీని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది. తాజాగా నవాజుద్దీన్ సిద్ధిఖీతో మరో ప్రమోషన్ ప్రోమోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నవాజుద్దీన్ మాట్లాడుతూ.. “నా పేరు షేరు. చిన్న సినిమాలను నిర్మించే పెద్ద ప్రొడ్యూసర్ ని. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్ తో కూడా నా దగ్గర సెల్ఫీలు ఉన్నాయి” అంటూ ఫోన్ లో ఫోటోలు చూపిస్తాడు. దానిని అలా కొసగిస్తూ.. “హృతిక్ రోషన్ ఇక్కడ లేడు, అందుకే తన ఫోటో లేదు” అంటూ చెప్పుకొచ్చాడు.

కంగనా అండ్ హృతిక్ మధ్య గొడవ ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఏళ్ళు గడుస్తున్నా ఆ వార్త మాత్రం హాట్ టాపిక్ గానే ఉంది. ఇప్పుడు కంగనా నిర్మిస్తున్న సినిమా కావడం, ప్రమోషన్స్ విషయం కూడా కంగనా చూసుకుంటున్న మూవీ ప్రోమోలో.. హృతిక్ పేరు రావడంతో ఇప్పుడు ఆ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. కాగా కంగనా ప్రస్తుత ఎమర్జెన్సీ (Emergency), చంద్రముఖి 2 (Chandramukhi 2) సినిమాల్లో నటిస్తుంది. ఈ రెండు మూవీ షూటింగ్స్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్నాయి.