తృటిలో శంకర్ తప్పించుకున్నాడు : భారతీయుడు 2 షూటింగ్‌లో భారీ ప్రమాదం! 

  • Published By: sreehari ,Published On : February 19, 2020 / 06:00 PM IST
తృటిలో శంకర్ తప్పించుకున్నాడు : భారతీయుడు 2 షూటింగ్‌లో భారీ ప్రమాదం! 

Updated On : February 19, 2020 / 6:00 PM IST

చెన్నై షూటింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ 2 (భారతీయుడు2) మూవీ షూటింగ్ జరుగుతున్న సమయంలో భారీ క్రేన్ విరిగిపడింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందారు. తమళ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో విలక్షణ నటుడు కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

చెన్నై సమీపంలోని పూనమల్లి వద్ద మూవీ షూటింగ్ జరుగుతోంది. అదే సమయంలో ఒక్కసారిగా భారీ క్రేన్ కింద పడిపోయింది. ముగ్గురు వ్యక్తులు మరణించగా, మరో 10 మందికి గాయాలయ్యాయి. క్రేన్ కిందపడిన సమయంలో అక్కడే దర్శకుడు శంకర్ కూడా ఉన్నారు. ఆయనకు తృటిలో ప్రమాదం తప్పింది. 

అతి సమీపంలోని కెమెరా డిపార్ట్ మెంట్ దగ్గరే ఉన్న శంకర్ అదృష్టవశాత్తూ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. దాంతో అక్కడివారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఒకవైపు తమిళ రాజకీయాలతో బిజీగా ఉంటూనే కమల్.. భారతీయుడు 2 మూవీ కోసం షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

కమల్ సరసన కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ 30 శాతం వరకు పూర్తి చేసుకుంది. కీలకమైన షూటింగ్ షెడ్యూల్ కోసం విదేశాలకు వెళ్లేందుకు కూడా చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.