Hyper Aadi: ‘లెట్ దెమ్ నో అంకుల్’.. మంచు విష్ణుపై ఆది సెటైర్లు!
జబర్ధస్త్ కార్యక్రమంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కమెడీయన్ హైపర్ ఆది. హైపర్ ఆది వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టుగా,, నిత్యం జరిగే వాటిపై..
Hyper Aadi: జబర్ధస్త్ కార్యక్రమంతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న కమెడీయన్ హైపర్ ఆది. హైపర్ ఆది వేసే పంచులు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. ట్రెండ్‌కు తగ్గట్టుగా,, నిత్యం జరిగే వాటిపై.. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉండే వాటిపై ఆది కౌంటర్లు వేస్తుంటాడు. ముఖ్యంగా ప్రముఖులని టార్గెట్ చేస్తూ హైపర్ ఆది వేసే పంచులు పిచ్చెక్కిస్తుంటారు. ఆయన స్కిట్స్‌పై గతంలో చాలా వివాదాలు కూడా నడిచాయి. గతంలో కత్తి మహేష్, రాకేష్ మాస్టర్, కతర్ పాప, శ్రీరెడ్డి ఇలా కొందరిపై హైపర్ ఆది పంచ్‌లు వేశాడు.
Neha Malik: నేహా.. నీ అందం ఆహా..!
అలా ఎవరు ఎప్పుడు ట్రెండ్ అయితే వారి మీద తన స్కిట్లలో వెరైటీ పంచ్‌లు రాసుకుంటాడు. తాజాగా మంచు విష్ణుని టార్గెట్ చేశాడు. మా ఎన్నికల సమయంలో మంచు విష్ణు తన ప్రసంగాల్లో ఎక్కువగా వాడిన పదం లెట్ దెమ్ నో అంకుల్, టంగుటూరి వీరేహం పకహం పంతులు లాంటి వాటిని పరోక్షంగా ఆది తన స్కిట్ లో వాడేశాడు. దానికి రోజా ఇంకాస్త హెల్ప్ చేస్తే అందరూ పడీపడీ నవ్వుకున్నారు. దీపావళి సందర్భంగా ఈటీవీలో తగ్గేదేలే పేరుతో చేసిన ఈ షో ప్రోమోలలో ఈ సెటైర్లు ఇప్పుడు చర్చకి దారితీస్తుంది.
2022 Telugu Films: వేల కోట్ల తెలుగు సినిమా.. వచ్చే ఏడాదే టార్గెట్!
ఆది తన స్కిట్ లో.. ‘అన్నీ మీకే తెలిసినట్టు మాట్లాడుతారేంటి? ఇంతకు ముందు ప్రియమణి గారు మా సైడ్ వచ్చి ఏమన్నారంటే.. అని ఆది అనడం.. హా ఏమన్నారు అని రోజా కౌంటర్ వేయడం. ఆదిని రాం ప్రసాద్ అందరూ పట్టుకుని ఉంటే.. లెట్ దెమ్ నో అంకుల్ లెట్ దెమ్ నో’.. అంటూ మంచు విష్ణు.. నటుడు నరేష్ మధ్య అప్పుడు మీడియా సమావేశం జరిగిన సన్నివేశాన్ని ఇమిటేట్ చేశారు.
Maharaju Song: రాజువయ్యా.. మహరాజువయ్యా.. ఇదో రకం సంతాపం!
అంతేకాదు.. ‘స్కిట్లో గెటప్ శ్రీను అంకుల్ లేడు కాబట్టి సరిపోయింది.. అసలు మీకు స్కిట్ గురించి తెలుసా? మీకు స్క్రిప్ట్ మీద శూన్యం.. ఆ గుడివాడ రహస్యాల గురించి తెలుసా? అంటూ కౌంటర్ వేశాడు. బయట నన్ను ఎప్పుడూ ఓ పది మంది పొగుడుతూ ఉంటారు.. అని ఆది అనడం.. ఎవరు అని పక్కనుంచి రాంప్రసాద్ అడగడం.. వాళ్ల పేర్లు నేను చెప్పను.. కావాలంటే మీరు వెళ్లి అడగండి వాళ్లు నా గురించి చెబుతారు’ అని మరో సెటైర్ వేశాడు. మరి ఈ స్కిట్ ను మంచు విష్ణు అండ్ ఫ్యామిలీ సింపుల్ గా తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి.