Allu Arjun : Allu Arjun : పుష్ప 2 సినిమా అవుతుందా లేదా అని చాలాసార్లు అనుకున్నా, సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనదే- అల్లు అర్జున్

5 సంవత్సరాలు సుకుమార్ ఏది చెబితే అది పిచ్చోళ్లలా చేశామన్నారు.

Allu Arjun : Allu Arjun : పుష్ప 2 సినిమా అవుతుందా లేదా అని చాలాసార్లు అనుకున్నా, సక్సెస్ క్రెడిట్ అంతా ఆయనదే- అల్లు అర్జున్

Updated On : February 8, 2025 / 11:30 PM IST

Allu Arjun : మైత్రి మూవీస్ లాంటి ప్రొడ్యూసర్స్ లేకపోతే పుష్ప లాంటి సినిమా రాదని అల్లు అర్జున్ అన్నారు. యాక్టర్స్, టెక్నీషియన్స్ కు హిట్ ఇచ్చేది ఒక్క డైరెక్టర్ మాత్రమే అని ఆయన చెప్పారు. ఆ క్రెడిట్ అంతా డైరెక్టర్ సుకుమార్ దే అని వ్యాఖ్యానించారు. సినిమాలో ఏది బాగుందన్నా అది డైరెక్టర్ గొప్పతనమే అని కామెంట్ చేశారు.

నేను సుకుమార్ కి బిగెస్ట్ ఫ్యాన్ ని అల్లు అర్జున్ చెప్పారు. 5 సంవత్సరాలు సుకుమార్ ఏది చెబితే అది పిచ్చోళ్లలా చేశామన్నారు. కరోనా టైమ్ లో ఎన్నో ఛాలెంజ్ లు ఎదురయ్యాయి. చాలాసార్లు ఈ సినిమా అవుతుందా? జాతర షూట్ లాస్ట్ వరకు చూస్తానా? అని అనిపించేది. ఈ సినిమా సక్సెస్.. నా ఆర్మీ ఫ్యాన్స్ కి అంకితం ఇస్తున్నా అని చెప్పారు. హైదరాబాద్ ఐటీసీ కోహినూర్ హోటల్ లో పుష్ప 2 థ్యాంక్యూ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడారు.

”ఈ ఐదేళ్లు నాకు మంచి పాజిటివ్ ఎక్స్ పీరియన్స్. లైఫ్ మీనింగ్ ఫుల్ అని నేర్పింది. మా అందరి జీవితాలు మీనింగ్ ఫుల్ చేసినందుకు సుకుమార్ కు ధాంక్యూ. మీరు నమ్మరు.. ఈ ఐదేళ్ల జర్నీలో చాలా సందర్భాల్లో చాలా సార్లు అనిపించింది.. ఈ సినిమా అవుతుందా లేదా అని. కోవిడ్ సమయంలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.

Also Read : ఆ పాకిస్థాన్ కానిస్టేబుల్ అల్లు అర్జున్ అభిమానా? ‘తండేల్’ సినిమాగా రావడానికి కారణం ఇదా?

కోవిడ్ సమయంలో 50 మందికి మించి జనం ఒక చోట ఉండకూడదన్నారు. మా యూనిట్ 500 మంది. అలాంటి సమయంలో ఇంతమంది కలిసి ఎలా పని చేస్తాం అనిపించింది. 2020 నుంచి ఇలాంటి ఎన్నో కష్టాలు పడ్డాం. జాతర ఎపిసోడ్ షూట్ చేసే సమయంలో నేను ఫ్లోర్ మీద పడుకుని.. ఈ జాతర ఎపిసోడ్ ఎండ్ నేను చూస్తానా, ఇది నేను కంప్లీట్ చేయగలనా.. లేదంటే ఇది నేను చేయలేనని మధ్యలో ఆగిపోతుందా అని అనుకున్న రోజులు కూడా ఉన్నాయి.

అలా ఎన్నో సవాళ్లు ఫేస్ చేశాం. ఈ సినిమా కానీ హిట్ అయితే.. కష్టమంతా నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసే నా ఫ్యాన్స్ కి అంకితం చేద్దామనుకున్నా.. ఈ సినిమా సక్సెస్ ను నా ఫ్యాన్స్ కి అంకితం చేస్తున్నా. ఐ లవ్ యు మై ఆర్మీ” అని అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యారు.

దర్శకుడు సుకుమార్..
”నేను ఒక అద్భుతం అని అనుకుంటాడు బన్నీ. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా అల్లు అర్జున్ దే. నేషనల్ అవార్డ్ విన్నర్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్పేవాడిని. ఒక పరి పూర్ణమైన హీరో అల్లు అర్జున్” అని సుకుమార్ అన్నారు.