Prashanth Neel : ‘సలార్1’ తో హ్యాపీగా లేను.. ‘సలార్ 2’ మాత్రం మీ ఊహాలకు అందదు
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్’.

Im not completely happy with Salaar performance in theatres says Prashanth Neel
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘సలార్: పార్ట్-1 సీజ్ ఫైర్’. ఈ చిత్రం గతేడాది ఇదే రోజున అంటే 2023 డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కలెక్షన్ల వర్షం కురిపించింది. రూ.700 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అయితే.. ఈ చిత్ర ఫలితం విషయంలో తాను సంతోషంగా లేనని ప్రశాంత్ నీల్ చెప్పాడు. అదే విధంగా సలార్ పార్ట్ 2 ఎవరి ఊహాలకు అందదన్నాడు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ నీల్ ఈ వ్యాఖ్యలు చేశాడు.
సలార్ ఫస్ట్ పార్ట్ కోసం తాను ఎంతో కష్టపడ్డానని అన్నాడు. అయితే.. వచ్చిన ఫలితంతో తాను సంతోషంగా లేనన్నాడు. ఎక్కడో కేజీఎఫ్ 2 ఛాయలు కనిపించాయని తెలిపాడు. ఇక పై మాత్రం అలా జరగదని హామీ ఇచ్చాడు.
NTR – Neel : ఎన్టీఆర్‌తో సినిమా పై అప్‌డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్.. ఏ జానరో తెలుసా?
సలార్ 2 చిత్రాన్ని ఖచ్చితంగా తన కెరీర్‌లో బెస్ట్ సినిమాగా తీస్తానని చెప్పుకొచ్చాడు. ప్రేక్షకుల ఊహలకు కూడా ఈ చిత్రం అందదు అని చెప్పాడు. జీవితంలో కొన్ని విషయాలపై ఎంతో స్పష్టంగా ఉన్నాను. అందులో సలార్ 2 ఒకటి అని చెప్పాడు.
ఇదిలా ఉంటే.. ‘సలార్ పార్ట్2: శౌర్యంగ పర్వం’ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా రావాలంటే చాలా సమయమే పట్టేటట్లు ఉంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్‌తో మూవీ చేయనున్నారు. మరోవైపు ప్రభాస్ సైతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.