Guppedantha Manasu : ‘నన్ను జగతి దగ్గరకు పంపేయండి’.. అంటూ వదిన దేవయానిపై విరుచుకుపడ్డ మహేంద్ర.. షాకైన ఫణీంద్ర
జగతి మరణంతో మహేంద్ర మద్యానికి బానిస అవుతాడు. నిలదీసిన వదిన దేవయానిని తనను కూడా జగతి దగ్గరకు పంపేయమని విరుచుకుపడతాడు. మహేంద్ర ప్రవర్తన చూసి అందరూ షాకవుతారు. 'గుప్పెడంత మనసు' సీరియల్‌లో ఏం జరిగింది?

Guppedantha Manasu
Guppedantha Manasu : మహేంద్ర జగతి జ్ఞాపకాలను తల్చుకుంటూ మద్యానికి బానిస అవుతాడు. తండ్రి పరిస్థితి చూసి రిషి ఆందోళనకు గురవుతాడు. మరోవైపు కాలేజి ఎండీ సీటులో ఎవరిని కూర్చెబెట్టాలా? అని ఫణీంద్ర ఆలోచనలో పడతాడు. గుప్పెడంత మనసు సీరియల్‌లో ఏం జరిగింది?
మహేంద్ర కాలేజీ ఆవరణలో కూర్చుని జగతి జ్ఞాపకాలను తల్చుకుని ఆవేదనకు గురవుతాడు. లోపల ఎండీ సీటులో ఎవరిని కూర్చెబెట్టాలా? అని ఫణీంద్ర చర్చ జరుపుతాడు. ఎవరూ ఆ పదవిలో కూర్చోవడానికి మొగ్గు చూపకపోవడంతో శైలేంద్ర పేరు సూచిస్తుంది దేవయాని. తండ్రి ఒప్పుకుంటే తాను ఆ పదవిలో కూర్చుంటాను అంటాడు ఉత్సాహంగా శైలేంద్ర. ఇంట్రెస్ట్ ఉన్నంత మాత్రాన అనుభవం లేని వారిని ఎండీ సీటులో కూర్చోబెట్టలేం కదా.. అంటూ గతంలో కోటి రూపాయలు అప్పు విషయంలో శైలేంద్ర చేసిన తప్పుని ఎత్తి చూపిస్తుంది వసుధర. దాంతో మీటింగ్‌లోని సభ్యులంతా శైలేంద్ర ఎండీగా ఉండడాన్ని ఒప్పుకోమంటారు. శైలేంద్ర, దేవయాని మొహాలు మాడిపోతాయి.
అనుభవంలేని శైలేంద్ర ఎండీ సీటులో కూర్చోడానికి అనర్హుడు అంటాడు ఫణీంద్ర. మీటింగ్ ఓవర్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందరూ ఇంటికి చేరుకున్నా మహేంద్ర ఇంటికి రాకపోవడంతో రిషి, వసుధర ఆందోళన పడతారు. అతని కోసం వెతుకుతారు. ఒక చెట్టు కింద తాగి పడి ఉన్న మహేంద్ర ఫోన్‌ని అపరిచితుడు ఎత్తి మహేంద్ర ఉన్న అడ్రస్ చెబుతాడు. వసుధర, రిషి అక్కడికి చేరుకుని మహేంద్రను ఇంటికి తీసుకువస్తారు. మహేంద్ర తాగి రావడాన్ని తప్పుపడుతుంది దేవయాని. ఇలా చేయడం సరికాదంటుంది. తను ఇలా తాగడానికి కారణం మీరే అంటాడు మహేంద్ర. తనను కూడా జగతి దగ్గరకు పంపించేయమంటాడు. అందరూ షాకవుతారు.
తెల్లారిన తర్వాత ఇంట్లో ఫణీంద్ర మీటింగ్ పెడతాడు. జగతి చనిపోయిన బాధ అందరిలో ఉన్నా ఆ బాధని మర్చిపోవాలని రొటీన్‌లో పడాలని ఫణీంద్ర రిషితో అంటాడు. మహేంద్ర ఉన్న పరిస్థితుల్లో కాలేజీ ఎండీగా బాధ్యతలు చూడలేడని నువ్వే ఆ బాధ్యత తీసుకోవాలని రిషీతో అంటాడు. అందుకు రిషి ఒప్పుకోడు. తనను చంపడానికి ప్రయత్నించిన వారిని .. తన తల్లిని మట్టుబెట్టిన వారిని కనిపెట్టాలని అంటాడు. ఆ విషయంలో రిషిని బాధపడొద్దని తాను ఫణీంద్ర మంత్రిని, ఎస్ఐని కలిశామని త్వరలోనే వారెవరో కనిపెడతారని చెప్పడంతో దేవయాని, శైలేంద్ర షాకవుతారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియాలంటే నెక్ట్స్ ఎపిసోడ్ వరకు ఎదురుచూడాల్సిందే. ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో ముకేష్ గౌడ, రక్ష గౌడ, సాయి కిరణ్, జ్యోతి రాయ్ ముఖ్యపాత్రల్లో నటించారు. కాపుగంటి రాజేంద్ర ఈ సీరియల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు.