Mega BlockBuster: ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో భారీ మల్టీస్టారర్.. రోహిత్ శర్మ, రణ్ వీర్ సింగ్, రామ్ చరణ్?
ఇటీవల భారత స్టార్ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో రోహిత్ నటిస్తున్న 'మెగా బ్లాక్ బస్టర్' సెప్టెంబర్ 4న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు ఉంది. ఈ పోస్టర్ లో ఇప్పటికే ఉన్న స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫోటోలు కూడా చూపించారు.

Indian Big Stars Rohith Sharma, Ranveer singh, Ram Charan Multistarer BlockBuster
Mega BlockBuster: ఇటీవల భారత స్టార్ క్రికెట్ ఆటగాడు రోహిత్ శర్మ తన ఇంస్టాగ్రామ్ వేదికగా ఒక పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ లో రోహిత్ నటిస్తున్న ‘మెగా బ్లాక్ బస్టర్’ సెప్టెంబర్ 4న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్టు ఉంది. ఇక ఇది చూసిన నెటిజెన్లు రోహిత్ మూవీలో నటించడమేంటి, అయినా అతనికి నటించే అంత సమయం ఎక్కడ కుదిరింది, ఇది నిజామా? అబద్దమా? అనే తికమకలో పడ్డారు.
Chiranjeevi Speech At Hounouring Blood Donors : నా అభిమానులు నాకు గర్వకారణం
ఆ తరవాత వరుసగా సౌరవ్ గంగూలీ, దీపికా పడుకోణె, తమిళ్ హీరో కార్తీ, రష్మిక మందాన, హిందీ కమెడియన్ కపిల్ శర్మ వంటి స్టార్స్ కూడా తమతమ ఇంస్టా వేదికగా వారివారి పోస్టర్లు రిలీజ్ చేయడంతో ఇదేదో బారీ మల్టీస్టారర్ అని అనుకుంటున్నారంతా. అయితే తాజాగా ఒక బాలీవుడ్ మీడియా ఛానల్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్ ద్వారా ఇంకో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసింది.
ఈ పోస్టర్ లో ఇప్పటికే ఉన్న స్టార్స్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్, టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ ఫోటోలు కూడా చూపించారు. అయితే ఇవి చూసిన నెటిజెన్లు ఇది ఏమన్నా వెబ్ సిరీస్ అయ్యుంటుందా? లేదా ఏమన్నా రియాలిటీ షో కోసం ప్రచారం అయ్యుంటుందా? అని ఊహాగానాలు వెల్లడిస్తున్నారు. అయితే ఈ పోస్టర్ల వెనుక ఉన్న అసలు కథ తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.