Nagarjuna – Mahesh Multi Starrer : మనిద్దరం కలిసి మల్టీస్టారర్ చేద్దాం అన్న నాగార్జున.. రెడీ అన్న మహేష్.. ఫ్యాన్స్ వెయిటింగ్..
మహేష్ బాబు ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ ని ట్విట్టర్ వేదికగా లాంచ్ చేసి నాగార్జునకి, సినిమా టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నాగార్జున దీనికి రిప్లై ఇస్తూ.. ''ట్రైలర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. హే.. మహేశ్!! 29 ఏళ్ల క్రితం...............

Nagarjuna - Mahesh Multi Starrer possible in feature
Nagarjuna – Mahesh Multi Starrer : ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా ఆయన తెరకెక్కుతున్న సినిమా ‘ది ఘోస్ట్’. యాక్షన్, థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మహేష్ బాబు రిలీజ్ చేశారు. అయితే ఈ సందర్భంగా మహేష్, నాగార్జున కలిసి త్వరలోనే మల్టీస్టారర్ తీయొచ్చని ట్వీట్స్ ద్వారా ఇండైరెక్ట్ గా తెలిపారు.
మహేష్ బాబు ది ఘోస్ట్ సినిమా ట్రైలర్ ని ట్విట్టర్ వేదికగా లాంచ్ చేసి నాగార్జునకి, సినిమా టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నాగార్జున దీనికి రిప్లై ఇస్తూ.. ”ట్రైలర్ రిలీజ్ చేసినందుకు థ్యాంక్స్. హే.. మహేశ్!! 29 ఏళ్ల క్రితం వారసుడు సినిమాలో నాతో కలిసి మీ నాన్న సూపర్‌స్టార్ కృష్ణగారు కలిసి నటించినప్పుడు చాలా ఆనందించాను. మనం కలిసి సినిమా ఎందుకు చేయకూడదు? ఆ సర్కిల్ ని ఎందుకు కంప్లీట్ చేయకూడదు” అని మహేశ్‌ని అడిగారు.
నాగార్జున చేసిన ఈ ట్వీట్ కి మహేష్ రిప్లై ఇస్తూ.. ”కచ్చితంగా చేద్దాం. దానికోసం ఎదురుచూస్తున్నాను” అని ట్వీట్ చేశాడు. దీంతో వీరిద్దరి కాంబోలో కచ్చితంగా సినిమా ఉంటుందని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వీరిద్దరూ వేరే హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాలు చేశారు. మరి వీరిద్దరి కాంబినేషన్ ఎప్పుడు వస్తుందో, ఏ డైరెక్టర్ కి ఆ అదృష్టం వస్తుందో చూడాలి.
??? Would be an absolute pleasure… now that would be something to look forward to! ??♥️
— Mahesh Babu (@urstrulyMahesh) August 25, 2022