Tim Cook : యాపిల్ సీఈఓతో సందడి చేసిన ఇండియన్ సినీ సెలబ్రిటీలు..

ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ టిమ్ కుక్ కి ముంబై స్పెషల్ వడాపావ్ తినిపించి వైరల్ అయింది. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన అనేకమంది ఇండియన్ సినీ సెలబ్రిటీలు టిమ్ కుక్ తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.

Tim Cook : యాపిల్ సీఈఓతో సందడి చేసిన ఇండియన్ సినీ సెలబ్రిటీలు..

Indian Celebrities Meet Apple CEO Tim Cook

Updated On : April 18, 2023 / 1:01 PM IST

Tim Cook :  ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ ఇండియాలో తమ మొట్టమొదటి ఫిజికల్ రిటైల్ స్టోర్‌ (Apple First physical retail store)ను ముంబైలోని జియో వరల్డ్ డ్రైవ్‌ (Jio World Drive Mall)లో ప్రారంభించింది. ఆపిల్ కంపెనీ CEO టిమ్ కుక్ (Tim Cook) భారత మొట్టమొదటి ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ డోర్స్ నేడు ఉదయం ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా వేలాది మంది ఆపిల్ అభిమానులు, టెక్ ఔత్సాహికులు భారీగా తరలివచ్చారు. ముందురోజు రాత్రి స్పెషల్ ప్రోగ్రాం నిర్వహించడంతో అనేకమంది ఇండియన్ సినీ సెలబ్రిటీలు ఆ కార్యక్రమానికి తరలి వచ్చి టిమ్ కుక్ ని కలిసి సందడి చేశారు.

ఇప్పటికే బాలీవుడ్ హీరోయిన్ మాధురి దీక్షిత్ టిమ్ కుక్ కి ముంబై స్పెషల్ వడాపావ్ తినిపించి వైరల్ అయింది. ఇక ఈ కార్యక్రమానికి వచ్చిన అనేకమంది ఇండియన్ సినీ సెలబ్రిటీలు టిమ్ కుక్ తో ఫొటో దిగి సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. రెహమాన్, బోనీకపూర్, మాధురి దీక్షిత్, రవీనా టాండన్, నేహా ధూపియా, రకుల్ ప్రీత్ సింగ్, షెర్లీ సేటియా, మౌని రాయ్.. ఇలా మరింతమంది ప్రముఖులు యాపిల్ స్టోర్ లో టిమ్ కుక్ తో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేశారు.