Lata Mangeshkar : సాయంత్రం 6.30 గంటలకు లతా మంగేష్కర్ అంత్యక్రియలు
ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్(92) ఇవాళ కన్నుమూశారు. మంగేష్కర్.. గత 29 రోజులుగా కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు.

Lata Mangeshker
Lata Mangeshkar Funerals : ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్ కన్నుమూసిన విషయం తెలిసిందే. గత 29 రోజులుగా కరోనాతో పోరాడి ఆమె తుదిశ్వాస విడిచారు. దిగ్గజ గాయని లతా మంగేష్కర్ అంత్యక్రియలు సాయంత్రం 6.30 గంటలకు జరుగనున్నాయి. ముంబైలోని శివాజీ పార్క్‌లో లతకు అంతిమ సంస్కారాలు నిర్వహించబోతున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. లతా మంగేష్కర్ అంత్యక్రియల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు. మరికాసేపట్లో ముంబైకి చేరుకోనున్న ప్రధాని మోదీ.. లత నివాసానికి వెళ్లి నివాళులర్పిస్తారు. అనంతరం శివాజీ పార్క్‌లో అంత్యక్రియల్లో పాల్గొంటారు.
మరోవైపు కొద్దిసేపటి క్రితం లతా మంగేష్కర్ పార్థివ దేహాన్ని బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి ఇంటికి తరలించారు. లత నివాసానికి పలువురు బాలీవుడ్ ప్రముఖులు తరలివచ్చారు. అమితాబ్ బచ్చన్, భూషణ్ కుమార్, శ్రద్ధా కపూర్ సహా పలువురు ప్రముఖులు.. లతా మంగేష్కర్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అంతకుముందు బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో లత పార్థివదేహానికి సచిన్ టెండూల్కర్ నివాళి అర్పించారు.
Lata Mangeshkar : గాన గంధర్వుడు, గాన కోకిల.. బాలు, లతాల మధ్య అనుబంధం..
ఇండియన్ లెజెండరీ గాయని లతా మంగేష్కర్(92) ఇవాళ కన్నుమూశారు. మంగేష్కర్.. గత 29 రోజులుగా కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పోరాడి ఓడిపోయారు. శనివారం నుండి ఆమె ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని చెప్పిన వైద్యులు ఆమె కన్నుమూసినట్లుగా ఆదివారం ఉదయం ప్రకటించారు.
గత నెల మొదటి వారం నుంచి ఆస్పిటల్ లోనే ఉన్న లతా మంగేష్కర్.. మరోసారి గత రెండు రోజులుగా విషమ పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. కరోనాతో గత నెల 8న ముంబయ్ లోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరిన లతాజీ.. అప్పటి నుంచీ ఐసీయూలోనే ట్రిట్ మెంట్ తీసుకుంటున్నారు. ఈమధ్య ఆమె ఆరోగ్యం కుదుటపడ్డట్టు డాక్టర్లు ప్రకటించడంతో అందరూ ఊపిరి పీల్చుకోగా.. ఆమె కోలుకున్నట్టు అభిమానులు సంబరపడ్డారు. కానీ ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది.
Lata Mangeshkar : లతా మంగేష్కర్ అంతక్రియలకు హాజరు కానున్న పీఎం నరేంద్ర మోదీ
కరోనాతో పాటు న్యూమోనియాతో బాధపడ్డ ఆమె గత మూడు రోజులుగా ఆరోగ్యం క్షీణించడంతో ఆదివారం కన్నుమూసినట్లుగా ప్రకటించారు. లతాజీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడంతో లతా మంగేష్కర్ చెల్లెలు ప్రఖ్యాత గాయని ఆశా భోస్లే హుటా హుటిన బ్రీచ్ కాండీ హాస్పిటల్ కు చేరుకుకోగా.. డాక్టర్లతో మాట్లాడిన ఆమె.. శనివారం రాత్రి వరకు లతాజీ ఆరోగ్యంపై మీడియాకు అప్ డేట్ ఇచ్చారు. చివరిగా ఆదివారం ఉదయం ఆమె కన్నుమూసినట్లుగా ప్రకటించారు.