Rana Daggubati : రానాకు సారీ చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్..

ఈ ఆదివారం టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి.. ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఏయిర్ లైన్స్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో నేడు ఇండిగో ఎయిర్ లైన్స్ రానాకు సారీ ఇచ్చింది.

Rana Daggubati : రానాకు సారీ చెప్పిన ఇండిగో ఎయిర్ లైన్స్..

Indigo airlines say sorry to rana daggupati

Updated On : December 5, 2022 / 2:46 PM IST

Rana Daggubati : ఈ ఆదివారం టాలీవుడ్ నటుడు రానా దగ్గుపాటి.. ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో ఏయిర్ లైన్స్ పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. తన కుటుంబంతో కలిసి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లేందుకు ఇండిగో ఏయిర్ లైన్స్ లో టికెట్స్ బుక్ చేసుకున్నాడు. కానీ బుక్ చేసుకున్న ఫ్లైట్ ఆలస్యం అవ్వడంతో, మరో ఫ్లైట్ లో బెంగళూరుకి తరలించారు సిబ్బంది.

Actor Rana Daggubati: ఇండిగో ఎయిర్ లైన్స్‎పై మండిపడ్డ రానా

కాగా ఈ సమయంలో రానాకు సంబంధించిన లగేజ్ మిస్ అయ్యింది. లగేజ్ వేరే ఫ్లైట్ లో వస్తుంది అంటూ ఇండిగో ఏయిర్ లైన్స్ సిబ్బంది రానాకు తెలియజేసింది. బెంగళూరు చేరుకున్నాక ఎంతసేపటికి.. ఆ లగేజ్ ఏ ఫ్లైట్ లో వస్తుంది, ఎక్కడ ఉంది అనే విషయాన్ని తెలియజేయకపోవడంతో రానా ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో నేడు ఇండిగో ఎయిర్ లైన్స్ రానాకు సారీ ఇచ్చింది.

“సార్ మీ లగేజ్ మిస్ అవ్వడంతో మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. దానికి మేము క్షమాపణలు అడుగుతున్నాము. త్వరలోనే మీ లగేజ్ మీకు అందజేస్తామని హామీ ఇస్తున్నాము” అంటూ ట్వీట్ చేసింది ఇండిగో ఎయిర్ లైన్స్ సంస్థ.