Nani : ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మామా ఈడికెంచి’..

‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మామా ఈడకెంచి’.. ‘జాతిరత్నాలు’ లో రాహుల్ రామకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.. ఇప్పుడు అతని డైలాగ్ అతనికే వేశారు నాని..

Nani : ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మామా ఈడికెంచి’..

Nani Rahul Ramakrishna

Updated On : September 5, 2021 / 3:52 PM IST

Nani: ఎన్నో అవాంతరాల తర్వాత నేచురల్ స్టార్ నాని నటించిన ‘టక్ జగదీష్’ సినిమా రిలీజ్‌కి లైన్ క్లియర్ అయ్యింది. శివ నిర్వాణ దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి ప్రొడ్యూస్ చేసిన ఈ ఫిలిం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Tuck Jagadish : అలాగైతే నాకు నేనే బ్యాన్ చేసుకుంటాను..

అయితే నాని ‘టక్ జగదీష్’ సినిమా గురించి పాపులర్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్, దానికి నాని ఇచ్చిన రిప్లై నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మామా ఈడకెంచి’.. ‘జాతిరత్నాలు’ లో రాహుల్ రామకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు తన డైలాగ్‌ని తనకే వేశారు హీరో నాని.

Naga Chaitanya : ఇదేం స్పీడు స్వామి..!

‘టక్ జగదీష్’ రిలీజ్ రోజైన సెప్టెంబర్ 10న రాహుల్ నటించిన వెబ్ మూవీ ‘నెట్’ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. తన సినిమా కూడా అదే రోజు విడుదల కాబోతుంది అంటూ రాహుల్, నానిని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు. దీనికి నాని స్పందిస్తూ.. ‘నా వల్లే ప్రాబ్లమ్ అయితే ఎల్లిపోతా మామా ఈడకెంచి’.. డైలాగ్ వేశారు. అదీ సంగతి..