ప్రధాని మోడీ, మిలింద్‌ల మధ్య సరదా సంభాషణ..

  • Published By: sekhar ,Published On : September 24, 2020 / 05:02 PM IST
ప్రధాని మోడీ, మిలింద్‌ల మధ్య సరదా సంభాషణ..

Updated On : September 24, 2020 / 5:14 PM IST

Fit India Dialogue- PM Modi, Milid Sonam: ప్రధాని మోడీ, నటుడు, ఫిట్‌నెస్ ఫ్రీకర్ మిలింద్ సోమన్ ల మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది.
ఫిట్‌నెస్ మరియు హెల్త్ ప్రమోషన్ కొరకు ఏర్పాటు చేసిన ‘Fit India Dialogue’ లో భాగంగా మోడీ ఈరోజు (సెప్టెంబర్ 24) ఫిట్‌నెస్ ఐకాన్స్ తో పాటు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తదితరులతో వీడియో కాల్ ద్వారా ముచ్చటించారు.

ఈ సందర్భంగా మోడీ.. ‘మీ వయసు గురించి మీరు చెప్పినా.. మీరు ఇంకా ఓల్డ్ గా కనిపిస్తున్నారు.. లేక ఇంకేదైనా కారణముందా?.. అని అడగ్గా..
మిలింద్.. ‘నన్ను చాలామంది అడుగుతారు మీ వయసు నిజంగా 55 సంవత్సరాలా అని.. అలాగే ఈ వయసులో నేను 500 కిలోమీటర్లు పరిగెడుతున్నానంటే ఆశ్చర్యపోతారు కూడా. నేను వారికి ఏం చెప్తానంటే.. మా అమ్మగారికి వయసు 81 సంవత్సరాలు.. ఆమె వయసుకు చేరేటప్పటికి నేను ఆమెలా ఉండాలని కోరుకుంటాను. మా అమ్మగారు నాతో పాటు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు’. అన్నారు.


మాజీ సూపర్ మోడల్‌ను “మేడ్ ఇన్ ఇండియా మిలింద్” అని సరదాగా ప్రస్తావించిన పీఎం మోడీ, మలింద్ తల్లి పుష్-అప్‌లు చేస్తున్న వీడియోను ఐదుసార్లు ఆశ్చర్యపోతూ చూశానని చెప్పారు.

‘దేశ ప్రధాని అనే అత్యున్నత ఉద్యోగం యొక్క ఒత్తిడిని మీరు ఎలా ఎదుర్కొంటారు’ అని మిలింద్ ప్రశ్నించగా.. “ఎటువంటి దురాశ లేకుండా, విధి భావనతో ఇతరులకు సేవ చేస్తున్నప్పుడు ఒత్తిడి అనేది ఉండదు. బదులుగా మీరు ఎక్కువ శక్తిని పొందుతారు. అలాగే, ప్రతిస్పర్ధ (పోటీ) ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు అది ఫిట్‌నెస్‌కు సంకేతం’.. అని మోడీ తెలిపారు.

జిమ్, ఎటువంటి మిషన్లు అవసరం లేకుండా 8 నుండి 10 అడుగుల ప్లేస్ ఉంటే ఇంట్లోనే చక్కటి వర్కౌట్స్ చేయొచ్చని చెప్పారు మిలింద్ సోమన్.