అశ్వినీదత్ మనవరాలు ‘నవ్య వైజయంతి దత్’

వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ పెద్ద కుమార్తె స్వప్నదత్, ప్రసాద్ వర్మ దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది. ఆ పాపకు ‘నవ్య వైజయంతి దత్’ అని నామకరణం చేశారు..

  • Published By: sekhar ,Published On : October 19, 2019 / 11:13 AM IST
అశ్వినీదత్ మనవరాలు ‘నవ్య వైజయంతి దత్’

Updated On : October 19, 2019 / 11:13 AM IST

వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ పెద్ద కుమార్తె స్వప్నదత్, ప్రసాద్ వర్మ దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది. ఆ పాపకు ‘నవ్య వైజయంతి దత్’ అని నామకరణం చేశారు..

ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అధినేత సి. అశ్వినీదత్ పెద్ద కుమార్తె స్వప్నదత్, ప్రసాద్ వర్మ దంపతులకు ఇటీవల ఓ పాప జన్మించింది. ఆ పాపకు ‘నవ్య వైజయంతి దత్’ అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు స్వప్న.. ఆమె తండ్రి వారసత్వంతో ఎప్పటినుండో సినిమా రంగంలో కొనసాగుతున్నారు.

తమ వైజయంతి సంస్థ తరపున 2000వ సంవత్సరంలో నాగార్జున హీరోగా నటించిన ‘ఆజాద్’ సినిమాతో తొలిసారి సహనిర్మాతగా తన సినీ కెరీర్ స్టార్ట్ చేశారు. అప్పటినుండి తమ సంస్థ నిర్మాణ బాధ్యతలు చూసుకోవడంతో పాటు, తన సోదరి ప్రియాంక దత్ తో కలిసి త్రి ఏంజెల్స్ స్టూడియోస్, మరియు స్వప్న సినిమాస్ సంస్థల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు.

‘మా కుటుంబం నుండి మరొక సభ్యురాలిని నేడు ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము, తనకు నవ్య వైజయంతి దత్ అనే పేరుని కుటుంబసభ్యులందరూ కలిసి నిర్ణయించాం’ అంటూ స్వప్న తన ఇన్‌స్టాగ్రామ్ లో నవ్య ఫోటోను పోస్ట్ చేశారు..