Manchu Manoj Marriage : మంచు మనోజ్ పెళ్లి రేపేనా? సైలెంట్‌గా మౌనికతో వివాహం!
టాలీవుడ్ లోని మంచు కుటుంబంలో మరోసారి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి. త్వరలోనే మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నా, ఆ వార్తలు పై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. తాజాగా వీరిద్దరి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

Is Manchu Manoj's wedding date fixed?
Manchu Manoj Marriage : టాలీవుడ్ లోని మంచు కుటుంబంలో మరోసారి పెళ్లి భజంత్రీలు మోగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ కుటుంబానికి చెందిన భూమా మౌనిక రెడ్డితో మంచు మనోజ్ ప్రేమలో ఉన్నాడు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరి ప్రేమ వార్త సినీ, రాజకీయ వర్గాల్లో చాలా హాట్ టాపిక్ గా మారింది. త్వరలోనే మంచు మనోజ్, భూమా మౌనిక పెళ్లి పీటలు ఎక్కబోతున్నారంటూ కొన్ని రోజులుగా కథనాలు వస్తున్నా, ఆ వార్తలు పై ఇప్పటి వరకు ఎటువంటి క్లారిటీ లేదు. తాజాగా వీరిద్దరి పెళ్లి తేదీ కూడా ఫిక్స్ అయ్యిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
Manchu Manoj Marriage : మంచు వారింట పెళ్లి పనులు.. భూమా మౌనికతో మంచు మనోజ్ పెళ్లి ఆ రోజేనా?
రేపే (మార్చి 3) మంచు మనోజ్, భూమా మౌనిక మేడలో మూడుముళ్లు వేయబోతున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల్లో కూడా పెళ్లి సందడి మొదలయింది అని తెలుస్తుంది. కానీ ఈ పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే ఇటీవల మంచు మనోజ్ త్వరలోనే ఒక శుభవార్త చెప్పబోతున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. కాగా ఈ వివాహం మనోజ్ మరియు మౌనిక లకు రెండో వివాహం. గతంలోనే వీరిద్దరికి విడివిడిగా పెళ్లి జరిగింది. 2015లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న మనోజ్, 2019 లో విడాకులు తీసుకున్నాడు. అలాగే మౌనిక రెడ్డికి కూడా విడాకులు కావడమే కాదు, ఒక పిల్లవాడు కూడా పుట్టాడు.
ఇక వీరిద్దరి ప్రేమ గురించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలే చేశాడు. వీరిద్దరి ప్రేమ ఇప్పటిది కాదు. మనోజ్, మౌనిక లకు మొదటి పెళ్లి కాకముందే ప్రేమించుకున్నట్లు, కానీ పెద్దలు అంగీకరించకపోవడంతో వేరే వారిని పెళ్లి చేసుకున్నారట. విడాకులు అవ్వడంతో మళ్ళీ వారిద్దరి ప్రేమకు రూట్ క్లియర్ అయ్యిందని, గత కొంత కాలంగా సహజీవినం కూడా చేస్తున్నారు అంటూ చెప్పుకొచ్చాడు.