OG : రెండు పార్టులుగా పవన్ ఓజీ మూవీ..!
ఓజీపై ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే..మరోవైపు టైమ్ దొరికినప్పుడల్లా మూవీస్ చేస్తున్నారు. పవన్ చేతిలో ఇప్పటికప్పుడు మూడు సినిమాలు ఉన్నాయి. ఆ మూడు మూవీస్ రిలీజ్ ఎప్పుడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. వీటిలో హరిహర వీరమల్లు, ఓజీపై ఓ రేంజ్‌లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి.
హరిహర వీరమల్లు షూటింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. ఇంకో నాలుగైదు రోజులు షూట్ చేస్తే మూవీ రిలీజ్ చేయొచ్చని ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు. పవన్ డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు.
Dil Raju : గద్దర్ అవార్డ్స్ పై దిల్ రాజు కీలక ప్రకటన..
హరిహర వీరమల్లు పార్ట్-1, పార్ట్-2 ఉంటాయని అఫీషియల్‌గానే అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు పవన్ చేస్తున్న మరో క్రేజీ మూవీ కూడా పార్ట్-2గా రాబోతుందని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. పవన్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్‌లో వస్తున్న ఓజీకి సీక్వెల్ ఉంటుందట.
Bhadrakaali Teaser : విజయ్ ఆంటోనీ భద్రకాళి టీజర్.. రూ. 197 కోట్లా?
సుజిత్, అడవిశేష్ కలసి ఓజీ కథను రెడీ చేస్తున్న టైమ్‌లోనే పార్ట్-2పై కూడా డిస్కషన్స్ జరిగాయంటున్నారు. ఓజీ షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అవ్వటంతో ప్రస్తుతం పార్ట్-2 స్టోరీపై సుజిత్ వర్క్ చేస్తున్నాడట. ఓజీలో అకిరానందన్ ఎంట్రీ ఉంటుందనే టాక్ చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. పార్ట్-1 క్లైమాక్స్‌లో అకిరానందన్‌ను ఇంటర్‌డ్యూస్ చేసి పార్ట్-2లో కొనసాగించే అవకాశం ఉందంటున్నారు. మరి ఓజీ పార్ట్-2 ఉంటుందా.? లేక జస్ట్ గాసిపేనా అనేది వేచి చూడాలి.