Jabardasth Emmanuel : డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్న జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. తమ్ముడి పెళ్లి గురించి మాట్లాడిన అన్న..
ఇమ్మాన్యుయేల్ అన్న వంశీ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తమ్ముడి పెళ్లి గురించి మాట్లాడాడు. (Jabardasth Emmanuel)
Jabardasth Emmanuel
Jabardasth Emmanuel : పటాస్ షోతో టీవీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఇమ్మాన్యుయేల్ జబర్దస్త్ తో మంచి ఫేమ్ తెచ్చుకున్నాడు. జబర్దస్త్ లో స్కిట్స్ తో పాటు, పలు టీవీ షో లలో చేస్తూ కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. పలు సినిమాల్లో కూడా నటించాడు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు వర్ష తో, ఫైమాతో లవ్ ట్రాక్ లు నడిపి బాగా నవ్వించాడు. ప్రస్తుతం ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు.(Jabardasth Emmanuel)
ఇమ్మాన్యుయేల్ అన్న వంశీ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా తన తముడ్ని ప్రమోట్ చేసుకుంటూనే అతని పెళ్లి గురించి మాట్లాడాడు.
Also Read : Roja – Indraja : రోజాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందని ఒక్కసారి పిలిస్తే.. ఇక్కడే సెటిల్ అయిపోయిన హీరోయిన్..
వంశీ మాట్లాడుతూ.. ఇమ్మాన్యుయేల్ కి గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె ఎవరో ఎవ్వరికి తెలీదు. నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఇమ్మాన్యుయేల్ బిగ్ బాస్ లో ఉండటంతో అతని గర్ల్ ఫ్రెండ్ అని ఎవరెవరివో ఫోటోలు పెట్టి నన్ను కూడా ట్యాగ్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఆ అమ్మాయి కాదు అని నేను వాళ్లకు రిప్లైలు ఇస్తున్నాను. వాళ్ళు ఎవరు, ఏంటి, ఫోటో చూపించొచ్చు కదా అని అడుగుతున్నారు.
నేను ఇమ్మాన్యుయేల్ వాళ్ళ అన్నయ్య అంటేనే గుర్తుపడుతున్నారు. ఆ అమ్మాయి ఇంకా చదువుతుంది, మున్ముందు బయటకి వెళ్లి చదువుతుంది. ఆమె ఎవరో తెలిస్తే ఏదో ఒకటి ఫేస్ చేయొచ్చు. అందుకే ఎవరికీ చెప్పట్లేదు. ఇమ్మాన్యుయేల్ బయటకు వచ్చాక ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసి అది అయ్యాక అప్పుడు అఫీషియల్ గా అందరికి చెప్తాడు. మ్యాగ్జిమమ్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఎంగేజ్మెంట్ అవుతుంది. ఆమె డాక్టర్. MBBS కంప్లీట్ చేస్తుంది ప్రస్తుతం అని తెలిపాడు. దీంతో ఇమ్మాన్యుయేల్ త్వరలోనే డాక్టర్ ని పెళ్లి చేసుకోబోతున్నాడని తెలుస్తుంది.
Also See : Payal Rajput : RX100 భామ పాయల్ రాజ్ పుత్ బర్త్ డే సెలబ్రేషన్స్.. ఫొటోలు..
