Jabardasth Rakesh – Jordar Sujatha : పెళ్లితో ఒకటైన జబర్దస్త్ ప్రేమ జంట..
జబర్దస్త్ ప్రేమ జంట రాకేష్ అండ్ సుజాత నేడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరి వివాహం జరిగింది. ఈ మ్యారేజ్ కి..

Jabardasth Rakesh – Jordar Sujatha
Jabardasth Rakesh – Jordar Sujatha : తెలుగు నెంబర్ వన్ కామెడీ షో జబర్దస్త్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న కమెడియన్ ‘రాకింగ్ రాకేష్’. ఇక ప్రముఖ న్యూస్ ఛానల్ లో ‘జోర్దార్ సుజాత’ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ కమ్ కమెడియన్ ‘సుజాత’. కాగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, డేటింగ్ చేస్తున్నారు అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. వాటిని నిజం చేస్తూ.. ఇటీవల పెళ్లి చేసుకోబోతున్నాము అంటూ ప్రకటించారు ఈ జంట. సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తమ ప్రేమని ప్రేక్షకులకు తెలియజేస్తూ, పెద్దల అంగీకారంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ తెలియజేసింది.
Jabardasth Rakesh – Jordar Sujatha :జబర్దస్త్ జంట రాకింగ్ రాకేష్, జోర్దార్ సుజాత పెళ్లి ఫోటోలు..
ఈ నేపథ్యంలోనే జనవరి నెలలో గ్రాండ్ గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు ఈ ప్రేమ జంట. తాజాగా రాకేష్ అండ్ సుజాత మూడు ముళ్ళు బంధంతో ఒక్కటయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో వీరి వివాహం జరిగింది. ఈ మ్యారేజ్ కి ఇరు కుటుంబ సభ్యులతో పాటు యాంకర్ రవి, గెటప్ శీను, ఏపీ మినిస్టర్ రోజా కుటుంబంతో కలిసి హాజరయ్యి న్యూ కపుల్ ని అశ్విరదించారు. ఇక ఈ పెళ్లి ఫోటోలను రోజా షేర్ చేస్తూ.. ‘నాకు అత్యంత ఆప్తులు నన్ను అమ్మా అని పిలిచే రాకేష్ మరియు సుజాత పెళ్లి బంధంతో ఒకటవుతున్నారు. ఈ జంట నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో వర్ధిల్లుగాక’ అంటూ రాసుకోచుంది.
ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజెన్లు కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాడు. కాగా జోర్దార్ సుజాతగా ఫేమ్ ని సంపాదించుకున్న సుజాత.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకుంది. ఆ తరువాత రాకేష్ తో ఉన్న పరిచయంతో జబర్దస్త్ షోలో నటించడం మొదలు పెట్టింది. ఆ పరిచయం కాస్త మెల్లగా ప్రేమగా మారి, ఇప్పుడు పెళ్లి వరకు చేరింది.
View this post on Instagram