Pushpa 2 : పుష్ప కోసం బెయిల్ మీద వచ్చిన కేశవ.. షూటింగ్స్‌లో పాల్గొంటున్న నటుడు..

పుష్ప కోసం బెయిల్ మీద వచ్చిన కేశవ. తన టాకీ పార్ట్ పూర్తీ చేసేందుకు షూటింగ్స్‌లో పాల్గొంటున్న నటుడు.

Pushpa 2 : పుష్ప కోసం బెయిల్ మీద వచ్చిన కేశవ.. షూటింగ్స్‌లో పాల్గొంటున్న నటుడు..

Jagadeesh Prathap Bandari came on bail o complete his shooting in Pushpa 2

Updated On : February 1, 2024 / 6:56 PM IST

Pushpa 2 : అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమాలో టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జగదీశ్ ప్రతాప్ బండారి.. ‘కేశవ’ అనే ముఖ్య పాత్ర చేసిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ స్నేతుడిగా నటిస్తూ.. హీరోతో పాటు సినిమా మొత్తం స్క్రీన్ షేర్ చేసుకొని ఆడియన్స్ లో బాగా రిజిస్టర్ అయ్యారు. అయితే ఇటీవల ఒక మహిళా ఆత్మహత్య కేసులో ప్రధాన నిందుతుడిగా ఆరోపణ ఎదుర్కొని అరెస్ట్ అయ్యాడు.

ఇక ఈ అరెస్ట్ తో పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రశ్నర్ధకంగా మారింది. సినిమాలో ప్రధాన పాత్ర అయిన జగదీశ్ పై షూట్ చేయాల్సిన చిత్రీకరణ చాలా వరకు బ్యాలన్స్ ఉందట. దీంతో పుష్ప 2 షూటింగ్ లేట్ అవుతుందని కామెంట్స్ వచ్చాయి. ఇక ఇటీవల ఈ సినిమా వాయిదా పడబోతుందని, చెప్పిన డేట్ కి రిలీజ్ చేయడం కష్టమని వార్తలు వినిపించాయి. ఈ వార్తలతో అభిమానులు ఆందోళన చెందారు.

Also read : Koratala Siva : కొరటాలతో పాటు మహేష్‌కి కూడా.. కోర్టు నోటీసు పంపించానంటున్న రచయిత..

అయితే మూవీ టీం మాత్రం.. ఇవేవి పట్టించుకోకుండా, షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. కేశవ పాత్రకి సంబంధించిన షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి జగదీష్ బెయిల్ పై జైలు నుంచి బయటకి తీసుకు వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జగదీష్ పుష్ప 2 షూటింగ్ లో పాల్గొంటున్నాడట. అతనికి సంబందించిన సీన్స్ అన్నిటిని ముందుగా పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేశారట.

కాగా ఈ చిత్రాన్ని ఆగష్టు 15న రిలీజ్ చేసేందుకు డేట్ ని ఫిక్స్ చేశారు. ఈ తేదీ లాంగ్ వీకెండ్ తో వస్తుంది. మొదటి భాగంతో రెండో పార్టు పై భారీ అంచనాలు క్రియేట్ అవ్వడంతో.. ఈ లాంగ్ వీకెండ్ కలెక్షన్స్ కి కలిసొచ్చే అవకాశం ఉంది. దీంతో మేకర్స్ ఎలాగైనా ఆ తేదికి సినిమాని తీసుకు వచ్చేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.