‘జగమే తంత్రం’.. జూలై 28న ‘రకిట రకిట’..

  • Published By: sekhar ,Published On : July 1, 2020 / 12:18 PM IST
‘జగమే తంత్రం’.. జూలై 28న ‘రకిట రకిట’..

Updated On : July 1, 2020 / 12:30 PM IST

కోలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ ధనుష్, యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ కలయికలో.. వై నాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో ప్రముఖ నిర్మాత ఎస్. శశికాంత్ నిర్మిస్తోన్న సినిమా..‘జగమే తంతిరమ్’.. తెలుగులో ‘జగమే తంత్రం’ పేరుతో రూపొందుతోంది.

ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది ధనుష్ నటిస్తున్న 40వ చిత్రం కావడం విశేషం. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం..

Jgame Thandhiram

జూలై 28న ‘జగమే తంత్రం’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఆ రోజు స్పెషల్ ఏంటంటే ధనుష్ పుట్టినరోజు.. ఆ సందర్భంగా సినిమాలోని ‘రకిట రకిట’ అనే సాంగ్ విడుదల చేయనున్నారు. ధనుష్ పక్కన ఐశ్వర్యా లక్ష్మీ కథానాయికగా నటిస్తుంది.. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: శ్రీయాస్ కృష్ణ, ఎడిటింగ్: వివేక్ హర్షన్.

Read:పెళ్లి పనులు ప్రారంభం!