RGV – Jagapathi Babu : ఆర్జీవీ ఓ తిక్కలోడు.. ఆర్జీవీ, జగపతి బాబు ఇంత వెరైటీ ఫ్రెండ్సా.. మూడు పెగ్గులేస్తే ఇద్దరి మధ్య గొడవే..
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు ఆర్జీవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

Jagapathi Babu Interesting Comments on Ram Gopal Varma
RGV – Jagapathi Babu : ఆర్జీవీ, జగపతి బాబు కాంబోలో ఎప్పుడో గాయం అనే సినిమా వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఆర్జీవీ మాత్రం నా ఇష్టం అంటూ తనకు ఇష్టమైన సినిమాలు తీస్తున్నాడు. ఆర్జీవీ, జగపతి బాబు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది, ఇద్దరూ ఖాళీగా ఉన్నప్పుడు కూర్చొని తాగేంత ఫ్రెండ్షిప్ ఉంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో జగపతి బాబు ఆర్జీవీ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. జగపతి బాబు మాట్లాడుతూ.. మేమిద్దరం కొట్టుకుంటాం. ఆయన తిక్కలోడు కదా ఏదో ఒకటి అంటాడు. నేను కూడా తిక్కలోడ్ని కాబట్టి నేను ఏదో ఒకటి తిరిగి అంటాను. మూడు పెగ్గుల తర్వాత ఇద్దరం గొడవ పడతాం. గాయం సినిమా సమయంలో ఊర్మిళ నాకు ఇష్టం లేదు అని చెప్పాను. ఎందుకు అని అడిగితే.. నాకు ఆమెకు కెమిస్ట్రీ లేదు అందుకే ఇష్టం లేదు అని చెప్పాను. ఊర్మిళని పిలిచి ఈ విషయం చెప్పాడు. ఊర్మిళ ఎందుకు ఇష్టం లేదు అని అడిగింది. నువ్వు ఇష్టం అని చెప్తేనే గాయం సినిమా పూర్తి చేస్తాను అన్నాడు ఆర్జీవీ. అయినా నేను అప్పుడు.. నువ్వు ఇష్టం లేదు, ఆర్జీవీ కూడా ఇష్టం లేదు, శ్రీదేవి ఆర్జీవికి ఇష్టం కాబట్టి నాకు ఇష్టం లేదు సినిమా ఆపుకుంటే ఆపుకో అన్నాను. దీంతో ఇది నాకు నచ్చింది అన్నాడు ఆర్జీవీ.
మరోసారి.. ఇలాగే మూడు పెగ్గులేసి అతని ముందు మూడు సిగరెట్స్ తాగాను అక్కడ బోర్ కొట్టి సిగరెట్ తాగటానికి బయటకి వెళ్లి వచ్చాను. ఆర్జీవీ ఎక్కడికి వెళ్లావని అడిగితే బోర్ కొట్టి సిగరెట్ తాగడానికి బయటకు వెళ్ళాను అన్నాను. ఆర్జీవీ బోర్ అంటావా అంటే అందరూ రామ్ గోపాల్ వర్మ బోర్ అనే అంటారు నీకు తెలీదు అది అన్నాను ఇది కూడా ఆర్జీవీకి నచ్చింది. ఇలాంటివి మా మధ్య చాలా ఉన్నాయి అని అన్నారు. దీంతో ఆర్జీవీ, జగపతి బాబు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ లాగా ఉన్నారే అని అనుకుంటున్నారు.