Jagapathi Babu : నన్ను సెట్ ప్రాపర్టీగా భావిస్తున్నారు.. కొన్ని సినిమాల్లో సరిగ్గా వాడుకోలేదు..
ప్రస్తుతం రామబాణం సినిమా ప్రమోషన్స్ లో జగపతి బాబు బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని తెలియచేశారు.

Jagapathi Babu sensational comments on his characters in movies
Jagapathi Babu : ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ఎన్నో సూపర్ హిట్స్ అందించిన జగపతి బాబు తన సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్నారు. స్టార్ హీరోల సినిమాల నుంచి చిన్న సినిమాల వరకు అన్ని సినిమాల్లో జగపతి బాబు ఏదో ఒక రోల్ చేస్తున్నారు. సెకండ్ ఇన్నింగ్స్ లో జగపతి బాబు ఫుల్ ఫామ్ లో ఉన్నారు.
తాజాగా జగపతి బాబు రామబాణం(Ramabanam) సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాలో గోపీచంద్(Gopichand)కి అన్నయ్యగా జగపతి బాబు నటించారు. ఈ సినిమా మే 5న థియేటర్స్ లోకి రానుంది. గతంలో కూడా గోపీచంద్, జగపతి బాబు అన్నదమ్ములుగా లక్ష్యం సినిమాలో నటించారు. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకులని అలరించనున్నారు. ప్రస్తుతం రామబాణం సినిమా ప్రమోషన్స్ లో జగపతి బాబు బిజీగా ఉన్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలని తెలియచేశారు.
జగపతి బాబు మాట్లాడుతూ.. నేనిప్పుడు హీరోని కాదు, విలన్ ని కాదు.. నటుడిని. దర్శకులు ఏం చెప్తే అది చేసే నటుడ్ని. కథ బాగుంటే, నాకు నచ్చితే ఎలాంటి పాత్ర చేయదనాయికైనా నేను రెడీనే. నా రెండో ఇన్నింగ్స్ లో నేను దాదాపు 80 సినిమాలు చేశాను. కానీ అందులో చెప్పుకోదగిన సినిమాలు ఓ పది ఉంటాయేమో. కొన్ని సినిమాల్లో నన్ను సరిగ్గా వాడుకోలేదు. సినిమాలో రిచ్ లుక్ కావాలంటే జగపతి బాబుని పెట్టేద్దాం అనుకుంటున్నారు. నన్ను కొంతమంది సెట్ ప్రాపర్టీగా భావించారు. ఒకప్పుడు డబ్బుల కోసం అలాంటి సినిమాలు చేశాను. కానీ ఇప్పుడు నాకు డబ్బులు అవసర్లేదు. చిన్న సినిమా అయినా సరే మంచి పాత్ర అయితే రెమ్యునరేషన్ తగ్గించుకొని మరీ చేస్తాను. కలర్ ఫోటో, కేరాఫ్ కంచరపాలెం, బలగం సినిమాలు నాకు చాలా నచ్చాయి. ఆలాంటి సినిమాల్లో నేను లేనని బాధపడ్డాను అని అన్నారు.
Jagapathi Babu : రజినీకాంత్ పై వైసీపీ విమర్శలు.. జగపతి బాబు ఏమన్నాడో తెలుసా?
నటుడిగా నాకు ఇప్పుడున్న కోరిక గాడ్ ఫాదర్ లాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది. గాయం సినిమాను మించి ఉండే పాత్రని చేయాలని ఉంది. ప్రస్తుతం సలార్ సినిమాలో ఎప్పుడూ చేయని ఓ పాత్రని చేశాను. మహేష్ – త్రివిక్రమ్ సినిమాలో కూడా ఓ చిన్న పాత్ర చేశాను అని తెలిపారు జగపతి బాబు.