Actor Srikanth: లెజెండ్‌తో జగపతి.. అఖండతో శ్రీకాంత్ దశ తిరిగేనా?

టాలీవుడ్ సీనియర్ హీరోలు కొందరు ఇటు హీరోలుగా కొనసాగలేక.. అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరైన పాత్రలు దొరకక సతమతమైపోతున్నారు. నిజానికి జగపతి బాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి సీనియర్..

Actor Srikanth: లెజెండ్‌తో జగపతి.. అఖండతో శ్రీకాంత్ దశ తిరిగేనా?

Actor Srikanth

Updated On : December 3, 2021 / 8:48 PM IST

Actor Srikanth: టాలీవుడ్ సీనియర్ హీరోలు కొందరు ఇటు హీరోలుగా కొనసాగలేక.. అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సరైన పాత్రలు దొరకక సతమతమైపోతున్నారు. నిజానికి జగపతి బాబు, శ్రీకాంత్, రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోలకు ఇప్పుడు హీరోలుగా అవకాశాలు తగ్గిపోయాయి. అందుకే జగపతి బాబు ముందుగా మేల్కొని నెగటివ్ పాత్రలతో పాటు యంగ్ హీరోలకు తండ్రిగా మంచి పాత్రలను ఎంచుకుంటూ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఇది జగపతికి సెకండ్ ఇన్నింగ్స్. దీనికి పునాది పడింది బాలకృష్ణ-బోయపాటిల సినిమా లెజెండ్.

Alekhya Harika: నిలువెల్లా నిషా ఎక్కించేస్తున్న దేత్తడి హారికా!

లెజెండ్ లో జగపతి బాబు స్టైలిష్ గా ఉంటూనే క్రూరంగా కనిపించే విభిన్నమైన నెగటివ్ పాత్రలో అదరగొట్టాడు. బాలయ్యకి సమఉజ్జి విలన్ గా జగపతి సినిమాను మరో మెట్టు ఎక్కిస్తే లెజెండ్ సినిమా జేపీ కెరీర్ ని పది మెట్లు ఎక్కించింది. అలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన జగపతి ఇప్పుడు టాలీవుడ్ మాత్రమే కాదు కోలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు స్టార్స్ సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా మారిపోయాడు. ఇప్పుడు ఇదే క్రమంలో మరో సీనియర్ హీరో శ్రీకాంత్ కూడా నెగటివ్ రోల్ లో అదరగొట్టాడు.

Chiranjeevi: ఒకేసారి మూడు సినిమాలు.. మెగాస్టార్ షటిల్ సర్వీస్!

బాలకృష్ణ-బోయపాటి హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అఖండతో శ్రీకాంత్ ఫుల్ లెంత్ విలన్ గా టర్న్ అయ్యాడు. మరి ఈ సినిమా జగపతిలాగా శ్రీకాంత్ కెరీర్ కూడా టర్న్ చేస్తుందా అనే చర్చ జరుగుతుంది. అఖండలో శ్రీకాంత్ పాత్రకి పరిపూర్ణ న్యాయం చేశాడు. అయితే.. లెజెండ్ లో జగపతి స్థాయి పాత్ర శ్రీకాంత్ కు పడలేదు. కానీ.. అఖండ శ్రీకాంత్ కెరీర్ లో హెల్ప్ అవుతుందని మాత్రం చెప్పుకోవచ్చు. శ్రీకాంత్ విలన్ కన్నా ముందే స్టార్ హీరోల సినిమాలలో క్యారెక్టర్స్ తో పాటు ఇప్పటికే కన్నడలో కూడా విలన్ పాత్రలతో స్టార్ట్ చేశాడు. సో కాస్త ముందో వెనకో శ్రీకాంత్ కూడా ఫుల్ బిజీ ఆర్టిస్ట్ కావడం గ్యారంటీగా కనిపిస్తుంది.