Naatu Naatu song : నాటు నాటు సాంగ్‌ని బాగానే వాడుకుంటున్నారుగా.. జైపూర్ పోలీసుల వినూత్న ప్రమోషన్స్..

తాజాగా జైపూర్ పోలీసులు ప్రజలకి డ్రంక్ అండ్ డ్రైవ్ కి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఈ నాటు నాటు పాటని వినూత్నంగా వాడారు...............

Naatu Naatu song : నాటు నాటు సాంగ్‌ని బాగానే వాడుకుంటున్నారుగా.. జైపూర్ పోలీసుల వినూత్న ప్రమోషన్స్..

Jaipur police use naatu naatu song for awareness

Updated On : January 15, 2023 / 8:19 AM IST

Naatu Naatu song :  RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ తెచ్చుకుందో అందరికి తెలిసిందే. ఆ సినిమాతో పాటు సినిమాలోని పాటలు కూడా ప్రపంచ ప్రేక్షకులని మెప్పించాయి. ముఖ్యంగా సినిమాలోని నాటు నాటు సాంగ్ అయితే విపరీతమైన ప్రజాదరణ పొందింది. ఇప్పటికే ఈ పాట ఆస్కార్ క్వాలిఫికేషన్ లిస్ట్ లోకి కూడా ఎంట్రీ అయింది. ఇక ఆస్కార్ తర్వాత ఉన్న గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఇటీవలే నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ విభాగంలో సొంతం చేసుకుంది.

దీంతో నాటు నాటు మరింత పాపులర్ అయింది. దేశమంతా ఈ పాటకి అవార్డు వచ్చిన సందర్భంగా చిత్రయూనిట్ కి అభినందనలు తెలుపుతున్నారు. ఇక ఈ పాటకి ఉన్న క్రేజ్ ని అందరూ వాడుకుంటున్నారు. కొంతమంది నాటు నాటు క్రేజ్ ని బిజినెస్ కి వాడుకుంటుంటే మరికొంతమంది జనాల్లో అవగాహన తీసుకురావడానికి వాడుతున్నారు. తాజాగా జైపూర్ పోలీసులు ప్రజలకి డ్రంక్ అండ్ డ్రైవ్ కి వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు ఈ నాటు నాటు పాటని వినూత్నంగా వాడారు.

Krithi Shetty : సైలెంట్‌గా హైదరాబాద్‌లో ఫ్యాన్స్ మీట్ పెట్టిన కృతిశెట్టి.. వైరల్ అవుతున్న సెల్ఫీ..

చరణ్, ఎన్టీఆర్ స్టెప్పులేస్తున్న ఫోటోపై.. ‘సే నో టు నో టు నో టు నో టు డ్రింకింగ్‌ వైల్‌ డ్రైవింగ్ (Say NoTo NoTo NoTo NoTo Drinking while Driving)‌’ అని రాశారు. ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘RRR సినిమా గోల్డెన్‌ గ్లోబ్‌ విజయానికి సంకేతంగా గ్లాస్‌ పైకెత్తి చీర్స్‌ చెప్పండి. కానీ, ఆ గ్లాసు మన కారులో ఉండకుండా చూసుకోండి. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరం’ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది. నాటు నాటు సాంగ్ ని బాగానే వాడుకుంటున్నారు గా అని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.