Jana Nayagan: ‘జన నాయగన్’ విడుదలకు సర్వం సిద్ధం.. అధికారిక ప్రకటన చేయనున్న మేకర్స్.
విజయ్ జన నాయగన్(Jana Nayagan) సినిమా విడులపై ఇవాళ క్లారిటీ వచ్చే అవమాశం ఉంది.
vijay thalapathy jana nayagan movie ready to release
- విజయ్ సినిమాపై కీలక తీర్పు
- ‘జన నాయగన్’ విడుదలపై క్లారిటీ వచ్చే అవకాశం
- ఫిబ్రవరిలో విడుదల అయ్యే అవకాశం
Jana Nayagan: తమిళ స్టార్ హీరో విజయ్ తలపతి నటిస్తున్న చివరి సినిమా ‘జన నాయగన్(Jana Nayagan)’ విడుదలకు సిద్ధం అయ్యిందా? అంటే అవుననే సమాదానాలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన కూడా రానుందట. దర్శకుడు హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా తెలుగు బ్లాక్ బస్టర్ భగవంత్ కేసరి సినిమాకు సీక్వెల్ గా రానుంది. భారీ హైప్ క్రియేట్ అయిన ఈ సినిమా జనవరి 9న విడుదల కావాల్సి ఉంది.
Eesha Rebba: తరుణ్ భాస్కర్ తో డేటింగ్.. ఆవిధంగా సంతోషమే.. క్లారిటీ ఇచ్చిన ఈషా రెబ్బ
కానీ, సెన్సార్ కారణాల వల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో, ఫ్యాన్స్ చాలా డిజప్పాయింట్ అయ్యారు. ఇక అప్పటినుంచి ఈ సినిమా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. ఫైనల్ గా ఈ సినిమాపై ఇవాళ తుది తీర్పు రానున్నట్టుగా తెలుస్తోంది. ఫైనల్ తీర్పు వెలువడిన వెంటనే ఈ సినిమాను ఫిబ్రవరి 6వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. అదే విషయాన్ని స్పెషల్ పోస్టర్ తో అధికారిక ప్రకటన చేయడానికి సిద్ధం అవుతున్నారట మేకర్స్.
ఇక ఈ న్యూస్ తెలియడంతో విజయ్ తలపతి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు తమ ఫేవరేట్ హీరో సినిమా విడుదల అవుతుండటం సంబరాలు చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. మరి పలు వాయిదాల తరువాత వస్తున్న జన నాయగన్ సినిమా ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
