జాన్వీ కపూర్ వుమెన్స్ డే డ్యాన్స్.. రచ్చ రచ్చే..

వుమెన్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో డ్యాన్స్ ఇరగదీసిన జాన్వీ కపూర్..

  • Published By: sekhar ,Published On : March 11, 2020 / 05:52 AM IST
జాన్వీ కపూర్ వుమెన్స్ డే డ్యాన్స్.. రచ్చ రచ్చే..

Updated On : March 11, 2020 / 5:52 AM IST

వుమెన్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రాంలో డ్యాన్స్ ఇరగదీసిన జాన్వీ కపూర్..

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ తల్లి నుంచి అందంతోపాటు అభినయాన్నికూడా అందిపుచ్చుకుంది. బాలీవుడ్‌లో కథానాయికగా నటించిన మొదటి సినిమాకే (ధడక్) జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. వుమెన్స్ డే సందర్భంగా నాసిక్ సిటీ పోలీసు వారు వుమెన్ సేఫ్టీ అవేర్‌నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. 

ఈ కార్యక్రమానికి జాన్వీ ముఖ్య అతిథిగా హాజరైంది. అక్కడ అభిమానుల కోరిక మేరకు డ్యాన్స్‌ చేసిందామె. ‘ధడక్‌’ చిత్రంలోని ‘జింగ్ జింగ్ జింగాత్’ సాంగ్‌కు జాన్వీ వేదికపై స్టెప్పులేయడం విశేషం. తనదైన శైలిలో ఆమె వేసిన హుషారైన స్టెప్పులకు ప్రేక్షకాభిమానులు చప్పట్లు, ఈలలతో సందడి చేశారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. జాన్వీ కరణ్‌జోహర్‌ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ‘తఖ్త్’ చిత్రంలో నటించనుంది. రణ్‌వీర్‌ సింగ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. 2021 డిసెంబర్‌లో క్రిస్మస్‌కు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. మొగలుల కాలం నాటి చారిత్రక కథాంశంతో  తెరకెక్కిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం జాన్వీ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో నటిస్తోంది.

See Also |  మేనమామల మధ్య ‘మెగా మేనల్లుడు’