Janhvi Kapoor : ఎన్టీఆర్ అయిపోయింది.. ఇప్పుడు రామ్ చరణ్.. నెక్స్ట్ బన్నీ.. టాలీవుడ్ లో జాన్వీ కపూర్ పాగా..
జాన్వీ కూడా టాలీవుడ్ లో పాగా వేయడానికి ట్రై చేస్తుంది.

Janhvi Kapoor Pair with Allu Arjun Atlee Film Rumors Goes Viral
Janhvi Kapoor : శ్రీదేవి కూతురిగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తన అందాలతో వరుస సినిమా ఛాన్సులు తెచ్చుకుంది. టాలీవుడ్ లో ఇటీవలే ఎన్టీఆర్ దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చి మొదటి తెలుగు సినిమాలోనే అందాలు బాగా ఆరబోసింది. సినిమా రిలీజ్ కి ముందే తెలుగులో జాన్వీకి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ప్రస్తుతం టాలీవుడ్ మంచి కమర్షియల్ సక్సెస్ లతో ఫుల్ ఫామ్ లో ఉండటంతో జాన్వీ కూడా టాలీవుడ్ లో పాగా వేయడానికి ట్రై చేస్తుంది.
ఎన్టీఆర్ దేవర సినిమా చేస్తున్నప్పుడే రామ్ చరణ్ సినిమాకు ఓకే చెప్పింది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న RC16 సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత జాన్వీ అల్లు అర్జున్ సినిమాలో నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇటీవలే పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ భారీ హిట్ కొట్టాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో మైథలాజికల్ టచ్ ఉన్న భారీ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ లోనే ఉండటంతో ఈ సినిమా ఆలస్యం అవుతుందని తెలుస్తుంది. ఈ సినిమా మొదలుపెడితే దీనికి చాలా టైం ఇవ్వాల్సి వస్తుందని ఈ లోపు ఒక కమర్షియల్ సినిమా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాడు అల్లు అర్జున్.
Also See : Producer SKN : తెలుగు హీరోయిన్స్ వివాదం.. ట్రోలర్స్ కి కౌంటర్, క్లారిటీ ఇచ్చిన నిర్మాత..
ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ – అట్లీ కాంబో ఎప్పట్నుంచో వినిపిస్తుంది. ఆల్రెడీ అట్లీ బన్నీకి కథ చెప్పి ఓకే చేసాడని. ఈ సినిమాలో జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. అట్లీ పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాని ప్లాన్ చేయనున్నాడు. ఇదే నిజమైతే కనుక జాన్వీకి టాలీవుడ్ లో మరో బంపర్ ఆఫర్ వచ్చినట్టే. మెల్లిమెల్లిగా జాన్వీ టాలీవుడ్ లో స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ ఇక్కడ పాగా వేయడానికి ట్రై చేస్తుంది.