‘మా’ లో మళ్లీ లొల్లి – నరేష్‌పై తిరుగుబాటు..
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) లో మళ్లీ మొదలైన ఆధిపత్య పోరు.. నరేష్‌కు వ్యతిరేకంగా లేఖ రాసిన జీవితా రాజశేఖర్..

మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) లో మళ్లీ మొదలైన ఆధిపత్య పోరు.. నరేష్‌కు వ్యతిరేకంగా లేఖ రాసిన జీవితా రాజశేఖర్..
మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ (మా) లో మళ్లీ లుకలుకలు మొదలయ్యాయి.. క్రమశిక్షణా కమిటీకి ‘మా’ ఈసీ మెంబర్స్ సుదీర్ఘమైన లేఖ రాయడం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దాదాపు తొమ్మిది పేజీల లేఖను ‘మా’ ప్రధాన కార్యదర్శి జీవితా రాజశేఖర్ రాశారు. ఈ లేఖలో 12 మంది ఈసీ మెంబర్స్ సంతకాలు చేశారు.
మరికాసేపట్లో ఈ లేఖ క్రమశిక్షణా కమిటీకి చేరనుంది. ‘మా’ అధ్యక్షుడిగా శివాజీరాజా నుంచి ఇప్పుడున్న వి.కె.నరేష్ వరకు ఎవరెవరు ఏం చేశారనే వివరాలను ఈ లేఖలో పేర్కొన్నారు. నరేష్ ప్రవర్తన, ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలు, అధికార దుర్వినియోగం పట్ల లేఖలో తీవ్రంగా తప్పు పట్టారు కొందరు ఈసీ మెంబర్లు.. 2020 ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో రాజశేఖర్ కొందరు సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Read Also : ఆసక్తి కలిగిస్తున్న ‘పలాస 1978’ లోని పాత్రలు
చిరంజీవి, మోహన్ బాబు వారించినా లెక్క చేయకుండా తను చెప్పాలనుకున్నది చెప్పేసిన రాజశేఖర్ తర్వాత తన పదవికి రాజీనామా చేయడం క్రమశిక్షణా కమిటీ దానిని ఆమోదించడం జరిగిపోయింది. ఇప్పుడు జీవిత లేఖతో ‘మా’ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. నరేష్‌పై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్న జీవిత.. ఈసీ మెంబర్లతో సుధీర్ఘ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడకుండానే వెనుదిరిగారు. రాజశేఖర్ బాటలోనే నటుడు జాకీ కూడా రాజీనామా చేయనున్నట్టు తెలుస్తుంది.