Jeevitha Rajasekhar : రజినీకాంత్‌కి చెల్లిగా జీవిత రాజశేఖర్.. గ్రాండ్ కంబ్యాక్..
రజినీకాంత్ సినిమాలో జీవిత రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర చేయబోతుంది. తమిళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన జీవిత.. దాదాపు 35 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ సినిమాతో తమిళ సినిమాలో నటిస్తుంది.

Jeevitha Rajasekhar as Rajinikanth's sister in lal salaam movie
Jeevitha Rajasekhar : సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు విషయంలో వేగం పెంచేశాడు. ప్రస్తుతం జైలర్ సినిమాలో నటిస్తున్న రజినీకాంత్.. తమిళ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ లైకాలో రెండు సినిమాలకు సైన్ చేసిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాల్లో ఒక చిత్రాన్ని రజినీకాంత్ కూతురు ఐశ్వర్య డైరెక్ట్ చేస్తుంది. ధనుష్ ‘3’ మూవీతో దర్శకురాలిగా మారిన ఐశ్వర్య.. దాదాపు 7 ఏళ్ళ గ్యాప్ తీసుకోని తన కెరీర్ లో మూడో సినిమాని తెరకెక్కిస్తుంది. గత ఏడాది నవంబర్ నెలలో ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. కాగా ఈ సినిమాలో మెయిన్ హీరో రజినీకాంత్ కాదు.
Ranveer Singh : షారుఖ్ ఖాన్‌తో పోటీకి వెళుతున్న రణ్‌వీర్ సింగ్.. కానీ సినిమాల్లో కాదు!
రజినీకాంత్ కేవలం అతిధిపాత్ర మాత్రమే పోషిస్తున్నాడు. మెయిన్ లీడ్ లో తమిళ హీరో విష్ణు విశాల్ కనిపించబోతున్నాడు. మరో తమిళ యాక్టర్ విక్రాంత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఒకప్పుడు హీరోయిన్ గా తమిళ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించిన జీవిత రాజశేఖర్.. ఈ సినిమాలో భాగం కాబోతుందట. పెళ్లి తరువాత నటనకి దూరంగా ఉంటున్న జీవిత ఇప్పడు ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. అది కూడా రజినీకాంత్ కి చెల్లిగా ఒక బలమైన క్యారెక్టర్ లో కనిపించబోతుంది.
తమిళ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన జీవిత.. దాదాపు 35 ఏళ్ళ తరువాత మళ్ళీ ఈ సినిమాతో తమిళ సినిమాలో నటిస్తుంది. మార్చ్ 7 నుంచి ఈ మూవీ షూటింగ్ లో జీవిత పాల్గొనుంది. కాగా ఈ సినిమా స్పోర్ట్స్ అండ్ రిలీజియన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కబోతుంది అని తెలుస్తుంది. ఐశ్వర్య ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించి దర్శకత్వం వహిస్తుంది. ఏ ఆర్ రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై తమిళ నాట భారీ అంచనాలే నెలకొన్నాయి.
Actress #JeevithaRajasekhar is acting as #Superstar @rajinikanth ‘s sister in #LalSalaam movie.. A key role in the movie..
She will be joining the shoot from March 7th in Chennai. pic.twitter.com/1uUmMtIqxx
— Ramesh Bala (@rameshlaus) March 1, 2023