Jewel Thief : విడుదలకు సిద్ధమైన సూపర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ చిత్రం.. ఎప్పుడంటే?

కృష్ణ‌సాయి హీరోగా తెర‌కెక్కిన‌ చిత్రం 'జ్యువెల్ థీప్'.

Jewel Thief : విడుదలకు సిద్ధమైన సూపర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్ చిత్రం.. ఎప్పుడంటే?

Jewel Thief movie release date fix

Updated On : October 26, 2024 / 5:29 PM IST

ఎన్నో సూప‌ర్ హిట్ చిత్రాలు, మ‌రెన్నో బ్లాక్‌బాస్ట‌ర్ మూవీల్లో న‌టించి ఎంతో మందికి అభిమాన హీరో అయ్యారు సూప‌ర్ స్టార్ కృష్ణ‌. ఆయ‌న‌కు డైహార్ట్ ఫ్యాన్స్ అయిన కృష్ణ‌సాయి.. ఆయ‌న స్ఫూర్తితో చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టారు. కృష్ణ‌సాయి హీరోగా తెర‌కెక్కిన‌ చిత్రం ‘జ్యువెల్ థీప్’. మీనాక్షి జైస్వాల్ క‌థానాయిక‌. పీఎస్ నారాయణ ద‌ర్శ‌క‌త్వంలో శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై మల్లెల ప్రభాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇటీవ‌ల ఈ మూవీ సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ స‌ర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో ఈ సినిమా న‌వంబ‌ర్ 8న విడుద‌ల కానుంది. ఈ మూవీలో సీనియ‌ర్ న‌టీన‌టులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతరెడ్డి పలువురు కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

Bigg Boss 8 : డేంజ‌ర్ జోన్‌లో ఆ ఇద్ద‌రు? ఈ వారం ఎలిమినేట్ కానుంది ఎవ‌రంటే?


హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ అభిమానిని. ఆయన ఇన్సిపిరేషన్ తో చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టాను. ‘జ్యువెల థీప్’ అనే మంచి కథలో ప్రేక్షకుల ముందుకొస్తున్నాను. ఇటీవల సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ప్ర‌శంస‌లు సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచాయి. ఇది ఓ సస్పెన్స్ థ్రిల్ల‌ర్. ఈ త‌రం ప్రేక్ష‌కుల‌కు బాగా న‌చ్చుతుంది. ఇక ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగుంది. ఒక‌ప్ప‌టి హీరోయిన్ ప్రేమ తో క‌లిసి ప‌నిచేయ‌డం సంతోషంగా ఉంది. అని అన్నారు.

Raashii Khanna : IAS అవ్వబోయి హీరోయిన్ అయిన రాశీఖన్నా.. స్టడీలో టాపర్ అయి కూడా..